Aabe vachchinappu dannee nayyeemgaani

ఆపె వచ్చినప్పు డన్నీ నయ్యీఁగాని
Language

(॥పల్లవి॥)
ఆపె వచ్చినప్పు డన్నీ నయ్యీఁగాని
వోపుదునా దొరవు నీ వొగిఁ గాచుకుండను

(॥ఆపె॥)
పిలిచే వాకెను నీవు ప్రియపడి; నేనైనాఁ
జెలిమారు సేవచేసేఁ జెప్పవయ్యా
అలఁదేణఁ(నం?) టా గంద మట్టె చేఁబట్టుకున్నాఁడ
వలరి నావురముపై నందాఁకా దాఁదవయ్యా

(॥ఆపె॥)
వెదకే వాపెను నీవు; వేడుకతో నే నుందాన
యెదుట; నాపని యానతియ్యవయ్యా
ఇది విడె మాకెకు మీఁదెత్తుకొన్నాఁడ; వందాఁకా
పొదిగి నాపుక్కిట నిప్పు డుండనీవయ్యా

(॥ఆపె॥)
చూచే వాపె కెదురు; సుద్దులు నేఁ జెప్పేను
చేచేత నీవెట్టయినాఁ జెనకవయ్యా
యేచి శ్రీవేంకటేశుఁడ యే నల మేలుమంగను
కాచి నన్నేలితివి ఆకాంతమారే నేనయ్యా

(||pallavi||)
ābĕ vachchinappu ḍannī nayyīm̐gāni
vobudunā dŏravu nī vŏgim̐ gāsuguṁḍanu

(||ābĕ||)
pilise vāgĕnu nīvu priyabaḍi; nenainām̐
jĕlimāru sevasesem̐ jĕppavayyā
alam̐deṇam̐(naṁ?) ṭā gaṁda maṭṭĕ sem̐baṭṭugunnām̐ḍa
valari nāvuramubai naṁdām̐kā dām̐davayyā

(||ābĕ||)
vĕdage vābĕnu nīvu; veḍugado ne nuṁdāna
yĕduḍa; nābani yānadiyyavayyā
idi viḍĕ māgĕgu mīm̐dĕttugŏnnām̐ḍa; vaṁdām̐kā
pŏdigi nābukkiḍa nippu ḍuṁḍanīvayyā

(||ābĕ||)
sūse vābĕ kĕduru; suddulu nem̐ jĕppenu
seseda nīvĕṭṭayinām̐ jĕnagavayyā
yesi śhrīveṁkaḍeśhum̐ḍa ye nala melumaṁganu
kāsi nannelidivi āgāṁtamāre nenayyā