ఆపె సేసే మేలుకు నమరునా నీ సేఁతలు
(॥పల్లవి॥)
ఆపె సేసే మేలుకు నమరునా నీ సేఁతలు
మోపులు గట్టేవు యింతి మునుకొన్న సిగ్గులు
(॥ఆప॥)
చుట్ట్టపువరుస నాకె సుద్దులు ని న్నడిగీ
అట్టె కప్పురము నోరి కంది యిచ్చెను
ముట్టి పయ్యదకొంగు నీ ముంజేతఁ జుట్టుకొని
బట్టబయఁలీఁదించేవు పడతిచన్నులను
(॥ఆప॥)
మంచితనముననే మచ్చికలు నీకుఁ జెప్పి
అంచగమన బాగాలు అంది యిచ్చెను
ముంచినవేడుకతోడ మునివేళ్ళ శిర సెత్తి
అంచలఁ దేలించేవు అంగనచూపులను
(॥ఆప॥)
వొడఁబాటుతోఁ గూడి ని న్నొరసి యలమేల్మంగ
అడియాలమగు సొమ్ము లంది యిచ్చెను
తొడతొడ మోయఁ గాలు దొక్కి శ్రీవేంకటేశ్వర
వడియించేవు చెమట వనితదేహమునా
(||pallavi||)
ābĕ sese melugu namarunā nī sem̐talu
mobulu gaṭṭevu yiṁti munugŏnna siggulu
(||āba||)
suṭṭṭabuvarusa nāgĕ suddulu ni nnaḍigī
aṭṭĕ kappuramu nori kaṁdi yichchĕnu
muṭṭi payyadagŏṁgu nī muṁjedam̐ juṭṭugŏni
baṭṭabayam̐līm̐diṁchevu paḍadisannulanu
(||āba||)
maṁchidanamunane machchigalu nīgum̐ jĕppi
aṁchagamana bāgālu aṁdi yichchĕnu
muṁchinaveḍugadoḍa muniveḽḽa śhira sĕtti
aṁchalam̐ deliṁchevu aṁganasūbulanu
(||āba||)
vŏḍam̐bāḍudom̐ gūḍi ni nnŏrasi yalamelmaṁga
aḍiyālamagu sŏmmu laṁdi yichchĕnu
tŏḍadŏḍa moyam̐ gālu dŏkki śhrīveṁkaḍeśhvara
vaḍiyiṁchevu sĕmaḍa vanidadehamunā