Aabe ninnu nishtooramu laadamjaaladu

ఆపె నిన్ను నిష్టూరము లాడఁజాలదు
Language

(॥పల్లవి॥)
ఆపె నిన్ను నిష్టూరము లాడఁజాలదు
యేపున నేమే నీకు నెచ్చరించవలసె

(॥ఆప॥)
తిలకించి చూడ నేల తెల్లవారినందాఁకా
మలకలమాట లేల మాపుదాఁకాను
నిలుచున్న దదివో నీయెదుటనే యింతి
వలసినట్లఁ జేయి వద్దనము నిన్నును

(॥ఆప॥)
వట్టియాసలు రేఁచేవు వలసినొల్లములను
ఱట్టుగా నూరకుండే వాఱడితోడను
యెట్టి ననలేక యాపె యింటిలోఁ గాచుకున్నది
కట్టుకో అందలిమేలు కాదనము నిన్నును

(॥ఆప॥)
తీరననీనవ్వులనే తెలియనీవు నీగుట్టు
నేరుపు నీప్రియములనెయ్యము బెట్టు
కూరిమి శ్రీవేంకటేశ కూడితివి మాచెలిని
నీరపము లాయ నిఁక నేర మెంచ నిన్నును

(||pallavi||)
ābĕ ninnu niṣhṭūramu lāḍam̐jāladu
yebuna neme nīgu nĕchchariṁchavalasĕ

(||āba||)
tilagiṁchi sūḍa nela tĕllavārinaṁdām̐kā
malagalamāḍa lela mābudām̐kānu
nilusunna dadivo nīyĕduḍane yiṁti
valasinaṭlam̐ jeyi vaddanamu ninnunu

(||āba||)
vaṭṭiyāsalu rem̐sevu valasinŏllamulanu
ṟaṭṭugā nūraguṁḍe vāṟaḍidoḍanu
yĕṭṭi nanalega yābĕ yiṁṭilom̐ gāsugunnadi
kaṭṭugo aṁdalimelu kādanamu ninnunu

(||āba||)
tīrananīnavvulane tĕliyanīvu nīguṭṭu
nerubu nīpriyamulanĕyyamu bĕṭṭu
kūrimi śhrīveṁkaḍeśha kūḍidivi māsĕlini
nīrabamu lāya nim̐ka nera mĕṁcha ninnunu