Aabe nenu savadula maamaamte naamaada

ఆపె నేను సవతుల మామాఁటె నామాట
Language

(॥పల్లవి॥)
ఆపె నేను సవతుల మామాఁటె నామాట
తీపులు వుట్టించితిని తెలుసుకో ఇపుడు

(॥ఆపె॥)
ముందర నున్నది చెలి ముసి ముసి నవ్వులతో
విందులు వెట్టీ మీకు వీడెపుమోవి
చెంది నీకు మేలు సుద్ది చెప్పితి నిదివో నేను
ఇందుకు నాకేమి మెచ్చు ఇచ్చేవో ఇపుడు

(॥ఆపె॥)
చేయి చాఁచీ నాపె నీపై సేసపాల దోసిటితో
చాయల గప్పములిచ్చీ జంటచున్నులు
సోయగపు సగినాలు చూచి చెప్పితి నిదివో
తీయని నారుణ మెట్టు తీర్చేవో ఇపుడు

(॥ఆపె॥)
పొంకక కాఁగిలించీని కొనగోరి పంతాలతో
వుంకువలు వెట్టీఁ జనవుల రతులు
పొంకపు శ్రీ వేంకటేశ బుద్దులు చెప్పి కూడితి
నింకా నాకుఁ జనవు లెట్లిచ్చేవో యిపుడు

(||pallavi||)
ābĕ nenu savadula māmām̐ṭĕ nāmāḍa
tībulu vuṭṭiṁchidini tĕlusugo ibuḍu

(||ābĕ||)
muṁdara nunnadi sĕli musi musi navvulado
viṁdulu vĕṭṭī mīgu vīḍĕbumovi
sĕṁdi nīgu melu suddi sĕppidi nidivo nenu
iṁdugu nāgemi mĕchchu ichchevo ibuḍu

(||ābĕ||)
seyi sām̐sī nābĕ nībai sesabāla dosiḍido
sāyala gappamulichchī jaṁṭasunnulu
soyagabu saginālu sūsi sĕppidi nidivo
tīyani nāruṇa mĕṭṭu tīrsevo ibuḍu

(||ābĕ||)
pŏṁkaga kām̐giliṁchīni kŏnagori paṁtālado
vuṁkuvalu vĕṭṭīm̐ janavula radulu
pŏṁkabu śhrī veṁkaḍeśha buddulu sĕppi kūḍidi
niṁkā nāgum̐ janavu lĕṭlichchevo yibuḍu