Aabe nenu nokkade amdugemayyaa

ఆపే నేను నొక్కటే అందుకేమయ్యా
Language

(॥పల్లవి॥)
ఆపే నేను నొక్కటే అందుకేమయ్యా
చేపట్టి యింతలో నేల సిగ్గులు వడేవు

(॥॥)
విన్నపములు వింటివా వెలఁది చెప్పెంపినవి
సన్నల నీకవి యెల్లా సరివచ్చెనా
నిన్నటి మీసుద్దులెల్లా నేఁదెలిసితి ననుచు
నన్నుఁ జూచి నీవేల నడుమఁ గొంకేవు

(॥॥)
కానుక లందుకొంటివా కామిని నీకంపినవి
తానకమై యవి నీచిత్తానఁ బట్టెనా
నానాటి మీసరితలు నాకు దిష్ట మాయనని
నే నిప్పుడేమనఁగాను నీవింత లోఁగేవు

(॥॥)
యేకతములాడితివా యింతిని రప్పించుకొని
కైకొని శ్రీవేంకటేశ కలసితివా
యీకడ నన్నేలితివి యిన్నియు నేగంటినని
నాకొరకు నెంతేసి నవ్వులు నవ్వేవు.

(||pallavi||)
ābe nenu nŏkkaḍe aṁdugemayyā
sebaṭṭi yiṁtalo nela siggulu vaḍevu

(||||)
vinnabamulu viṁṭivā vĕlam̐di sĕppĕṁpinavi
sannala nīgavi yĕllā sarivachchĕnā
ninnaḍi mīsuddulĕllā nem̐dĕlisidi nanusu
nannum̐ jūsi nīvela naḍumam̐ gŏṁkevu

(||||)
kānuga laṁdugŏṁṭivā kāmini nīgaṁpinavi
tānagamai yavi nīsittānam̐ baṭṭĕnā
nānāḍi mīsaridalu nāgu diṣhṭa māyanani
ne nippuḍemanam̐gānu nīviṁta lom̐gevu

(||||)
yegadamulāḍidivā yiṁtini rappiṁchugŏni
kaigŏni śhrīveṁkaḍeśha kalasidivā
yīgaḍa nannelidivi yinniyu negaṁṭinani
nāgŏragu nĕṁtesi navvulu navvevu.