Aabe nemta yalayimche vayyee nanni panulu

ఆపె నెంత యలయించే వయ్యీ నన్ని పనులు
Language

(॥పల్లవి॥)
ఆపె నెంత యలయించే వయ్యీ నన్ని పనులు
యీ పొద్దుకాడ మరి యిఁకనేల మాటలు

(॥ఆపెె॥)
పయ్యద నిండాఁ గప్పుక పవ్వళించి వున్న చెలి-
నియ్యెడకు వచ్చి నీవదేల లేపేవు
చయ్యన నద్దమరేయి చనుదెంచినవాఁడవు
వొయ్యనె పవ్వళించు మొకవంక నీవును

(॥ఆపె॥)
కన్నులు మూసుక నీకేకాఁ గలలు గనఁగాను
చన్నులేల పట్టేవు సటలంటాను
వున్నతి వరుసపద్య మొప్పగించ వచ్చితిని
మిన్నక కూచుండుము మేలుకొనీ నిపుడు

(॥ఆపె॥)
అండ నీవున్నాఁడవంటా అటు గాఁగిలించుకొంటే
వుండతివి నిజాలకు నొద్దికై నీవు
దండిగా శ్రీవేంకటేశ దక్కె నలమేలుమంగ
నిండుకొనఁ గూడితి నిన్నుఁ జూచి నవ్వెను

(||pallavi||)
ābĕ nĕṁta yalayiṁche vayyī nanni panulu
yī pŏddugāḍa mari yim̐kanela māḍalu

(||ābĕె||)
payyada niṁḍām̐ gappuga pavvaḽiṁchi vunna sĕli-
niyyĕḍagu vachchi nīvadela lebevu
sayyana naddamareyi sanudĕṁchinavām̐ḍavu
vŏyyanĕ pavvaḽiṁchu mŏgavaṁka nīvunu

(||ābĕ||)
kannulu mūsuga nīgegām̐ galalu ganam̐gānu
sannulela paṭṭevu saḍalaṁṭānu
vunnadi varusabadya mŏppagiṁcha vachchidini
minnaga kūsuṁḍumu melugŏnī nibuḍu

(||ābĕ||)
aṁḍa nīvunnām̐ḍavaṁṭā aḍu gām̐giliṁchugŏṁṭe
vuṁḍadivi nijālagu nŏddigai nīvu
daṁḍigā śhrīveṁkaḍeśha dakkĕ nalamelumaṁga
niṁḍugŏnam̐ gūḍidi ninnum̐ jūsi navvĕnu