ఆపె నెంత పొగడేపు అన్నిటా నేర్పరియని
(॥పల్లవి॥)
ఆపె నెంత పొగడేపు అన్నిటా నేర్పరియని
తీపులు వుట్టించేవారు తిట్టినా దీవెనలు
(॥ఆపె॥)
చనవుగలసతులు సాదించితే నమరు
ననుపైనవారలు నవ్వితేఁ. జెల్లు
మనసువచ్చినవారు మంతనమాఁడగఁదగు
యెనసినచోటిపొందు లితవులై తోఁచును
(॥ఆపె॥)
చుట్టరికమైనవారు సొలసినా వేడుకౌను
గుట్టెఱిఁగినవారు దీకొనినా మెచ్చు
పొట్టఁబొరుగువా రేతప్పులు వట్టినాఁ బొసఁగు
దిట్టసతు లొడివట్టితీసితే సమ్మతము
(॥ఆపె॥)
ఆసపడివచ్చినవా రాయములంటినా మేలు
బాసగొన్నవార లెంతపైకొన్నా లెస్స
వాసితో నన్నేలితివి వలచి శ్రీవేంకటేశ
సేసవెట్టినవా రెంతచెనకినా మంచిది
(||pallavi||)
ābĕ nĕṁta pŏgaḍebu anniḍā nerbariyani
tībulu vuṭṭiṁchevāru tiṭṭinā dīvĕnalu
(||ābĕ||)
sanavugalasadulu sādiṁchide namaru
nanubainavāralu navvidem̐. jĕllu
manasuvachchinavāru maṁtanamām̐ḍagam̐dagu
yĕnasinasoḍibŏṁdu lidavulai tom̐sunu
(||ābĕ||)
suṭṭarigamainavāru sŏlasinā veḍugaunu
guṭṭĕṟim̐ginavāru dīgŏninā mĕchchu
pŏṭṭam̐bŏruguvā redappulu vaṭṭinām̐ bŏsam̐gu
diṭṭasadu lŏḍivaṭṭidīside sammadamu
(||ābĕ||)
āsabaḍivachchinavā rāyamulaṁṭinā melu
bāsagŏnnavāra lĕṁtabaigŏnnā lĕssa
vāsido nannelidivi valasi śhrīveṁkaḍeśha
sesavĕṭṭinavā rĕṁtasĕnaginā maṁchidi