Aabe neegum dagu neevu naabege taguduvayya

ఆపె నీకుఁ దగు నీవు నాపెకే తగుదువయ్య
Language

(॥పల్లవి॥)
ఆపె నీకుఁ దగు నీవు నాపెకే తగుదువయ్య
చేపట్టి మీ యిద్దరికిఁ జెప్పరాదు మోహము

(॥ఆప॥)
తామెరరేకులవంటి తగునీకన్ను లనుచుఁ
దామెరలే చేతఁబట్టెఁ దరుణి
కామించి పాలజలధికడఁ బవ్వళింతు వని
కోమలి పాలజలధి కూతురాయ నదివో

(॥ఆపె॥)
బంగారు పచ్చడము నీపైఁ గప్పితి వంచు
బంగారుపతిమాయఁ బడఁతి
అంగవించె నీపాద మాకాశ మంటాను
అంగన తననడుము ఆకసముఁ బోలెను

(॥ఆపె॥)
కొండపై శ్రీవేంకటేశ కోరి నీ వెక్కితి వని
కొండవంటి నీవురము కొమ్మ యెక్కెను
అండనలమేలుమంగ ఆపె నీకుఁ గలుగఁగా
నండ నీదాసులకు నీ వాపె యూ గలిగితిరి

(||pallavi||)
ābĕ nīgum̐ dagu nīvu nābĕge taguduvayya
sebaṭṭi mī yiddarigim̐ jĕpparādu mohamu

(||āba||)
tāmĕraregulavaṁṭi tagunīgannu lanusum̐
dāmĕrale sedam̐baṭṭĕm̐ daruṇi
kāmiṁchi pālajaladhigaḍam̐ bavvaḽiṁtu vani
komali pālajaladhi kūdurāya nadivo

(||ābĕ||)
baṁgāru pachchaḍamu nībaim̐ gappidi vaṁchu
baṁgārubadimāyam̐ baḍam̐ti
aṁgaviṁchĕ nībāda māgāśha maṁṭānu
aṁgana tananaḍumu āgasamum̐ bolĕnu

(||ābĕ||)
kŏṁḍabai śhrīveṁkaḍeśha kori nī vĕkkidi vani
kŏṁḍavaṁṭi nīvuramu kŏmma yĕkkĕnu
aṁḍanalamelumaṁga ābĕ nīgum̐ galugam̐gā
naṁḍa nīdāsulagu nī vābĕ yū galigidiri