ఆపె నీకు మేలుది నీవాపెపై బత్తిగలవు
(॥పల్లవి॥)
ఆపె నీకు మేలుది నీవాపెపై బత్తిగలవు
చేపట్టి కరుణతోడఁ జిత్తగించవయ్యా
(॥ఆపె॥)
వెలఁది మాఁటలు నీకు విన్నపము సేసితివి
సొలసి గురుతు లెల్లాఁ జూపితిమి
పిలిచితి మింటికిని ప్రియములు చెప్పితిమి
అలరి మారుత్తరము లానతియ్యవయ్యా
(॥ఆపె॥)
కమ్మటి నాకె యంపిన కానుకలు నిచ్చితిమి
ముమ్మాటి దాఁకా నీకు మొక్కితిమి
నెమ్మది నీబాసలు నీకుఁ దలఁపించితిమి
యిమ్ముల నీచిత్త మిఁక నెట్టున్నదయ్యా
(॥ఆపె॥)
చుట్టపు వరుసలెల్లా సొంపుగాఁ దెలిపితిమి
బెట్టుగా నాపెచే సేస వెట్టించితిమి
యిట్టె శ్రీవేంకటేశ యేలితివి; తా సిగ్గుతో
గుట్టున నున్నది తనగుణము మెచ్చవయ్యా
(||pallavi||)
ābĕ nīgu meludi nīvābĕbai battigalavu
sebaṭṭi karuṇadoḍam̐ jittagiṁchavayyā
(||ābĕ||)
vĕlam̐di mām̐ṭalu nīgu vinnabamu sesidivi
sŏlasi gurudu lĕllām̐ jūbidimi
pilisidi miṁṭigini priyamulu sĕppidimi
alari māruttaramu lānadiyyavayyā
(||ābĕ||)
kammaḍi nāgĕ yaṁpina kānugalu nichchidimi
mummāḍi dām̐kā nīgu mŏkkidimi
nĕmmadi nībāsalu nīgum̐ dalam̐piṁchidimi
yimmula nīsitta mim̐ka nĕṭṭunnadayyā
(||ābĕ||)
suṭṭabu varusalĕllā sŏṁpugām̐ dĕlibidimi
bĕṭṭugā nābĕse sesa vĕṭṭiṁchidimi
yiṭṭĕ śhrīveṁkaḍeśha yelidivi; tā siggudo
guṭṭuna nunnadi tanaguṇamu mĕchchavayyā