ఆపె నీ పట్టపుదేవు లాపెపై బత్తి గలవు
(॥పల్లవి॥)
ఆపె నీ పట్టపుదేవు లాపెపై బత్తి గలవు
యేపున మీయిద్దరికి నింపులే యౌను
(॥ఆప॥)
వెనుకొని పతితోను వెంగేలు సతులాడినాఁ
జనవు గలిగితేను సంతోస మౌను
పెనఁగి వేఁడుకొనఁగాఁ బ్రియునితో బిగిసినా
మనసు లెనసితేను మంచిదే యౌను
(॥ఆప॥)
పొట్టఁ బొరుగువారలు బొమ్మల జంకించి నాను
చుట్టరికాలు గలితే సొంపులే యౌను
వట్టిసణఁగులతో వాసిపంతాలు చూపినా
నెట్టుకొన్న వానియైతే నెయ్యములే యౌను
(॥ఆప॥)
కొలువున నున్నవారు గుంపించి నవ్వినాను
చెలిమి గలిగితే మచ్చిక యౌను
యెలమి శ్రీవేంకటేశ యింతెల మేల్మంగ యాకె
కలసితి రిద్దరును కడువేడు కౌను
(||pallavi||)
ābĕ nī paṭṭabudevu lābĕbai batti galavu
yebuna mīyiddarigi niṁpule yaunu
(||āba||)
vĕnugŏni padidonu vĕṁgelu sadulāḍinām̐
janavu galigidenu saṁtosa maunu
pĕnam̐gi vem̐ḍugŏnam̐gām̐ briyunido bigisinā
manasu lĕnasidenu maṁchide yaunu
(||āba||)
pŏṭṭam̐ bŏruguvāralu bŏmmala jaṁkiṁchi nānu
suṭṭarigālu galide sŏṁpule yaunu
vaṭṭisaṇam̐gulado vāsibaṁtālu sūbinā
nĕṭṭugŏnna vāniyaide nĕyyamule yaunu
(||āba||)
kŏluvuna nunnavāru guṁpiṁchi navvinānu
sĕlimi galigide machchiga yaunu
yĕlami śhrīveṁkaḍeśha yiṁtĕla melmaṁga yāgĕ
kalasidi riddarunu kaḍuveḍu kaunu