ఆపె నన్ను నొక్కటిగా నప్పుడే సేసితివయ్య
(॥పల్లవి॥)
ఆపె నన్ను నొక్కటిగా నప్పుడే సేసితివయ్య-
వో పో పో నీకేరడాల కోపము గాని
(॥ఆపె॥)
తక్కరిగాదు ఆపె తాటోటుఁ గాదు నీఁ
వెక్కువ సేసి పొగడే యెంత గలదు
చక్కనిది యౌను సరసురాలు నౌను
వుక్కును సరిసేసుకో నోపము గాని
(॥ఆపె॥)
మంకుఁజల మెరఁగదు మందెమేళ మెరఁగదు
అంకెల నీవు మోహించ నరుహ మౌను
పొంకాలు నేరుచు నీతో పొందుసేయ నేరుచును
వుంకువ నాపింటికిఁ బో నోపఁగాని
(॥ఆపె॥)
కలహమునకుఁ జొరదు కపటానకుఁ జొరదు
అలరి నీవూడిగాని కాపె వలెను
యెలమి శ్రీ వేంకటేశ యీడ నన్నుఁగూడితివి
వొలిసి యెరిఁగించుకో నోపము గాని
(||pallavi||)
ābĕ nannu nŏkkaḍigā nappuḍe sesidivayya-
vo po po nīgeraḍāla kobamu gāni
(||ābĕ||)
takkarigādu ābĕ tāḍoḍum̐ gādu nīm̐
vĕkkuva sesi pŏgaḍe yĕṁta galadu
sakkanidi yaunu sarasurālu naunu
vukkunu sarisesugo nobamu gāni
(||ābĕ||)
maṁkum̐jala mĕram̐gadu maṁdĕmeḽa mĕram̐gadu
aṁkĕla nīvu mohiṁcha naruha maunu
pŏṁkālu nerusu nīdo pŏṁduseya nerusunu
vuṁkuva nābiṁṭigim̐ bo nobam̐gāni
(||ābĕ||)
kalahamunagum̐ jŏradu kabaḍānagum̐ jŏradu
alari nīvūḍigāni kābĕ valĕnu
yĕlami śhrī veṁkaḍeśha yīḍa nannum̐gūḍidivi
vŏlisi yĕrim̐giṁchugo nobamu gāni