ఆపె మఱఁగున నీవేమైనాఁ జేసినది గద్దో
(॥పల్లవి॥)
ఆపె మఱఁగున నీవేమైనాఁ జేసినది గద్దో
పూఁప సన్నలనే కడుఁబొద్దులు వుచ్చెను
(॥ఆపె॥)
బత్తిసేసి యాకె నీపై పదములు వాడఁగాను
యిత్తల నీవింతలోనే యేమి నవ్వేవు
కొత్తగా సింగారించుకొన్నందుకు మెచ్చఁగాను
చిత్తగించి నీవెంత సిగ్గువడేవు
(॥ఆపె॥)
కాయపు గురుతులపై కస్తూరి యలఁదరాఁగా
చేయివట్టి ప్రియాలెంత చెప్పవచ్చేవు
చాయల నీవలపులు సారెసారెఁ బొగడఁగా
ఆయములు మోచీనంటా నానలేల పెట్టేవు
(॥ఆపె॥)
ముచ్చటతో నాపె నీమోవితేనె లానఁగాను
ఇచ్చగించి పలుసోఁకు లేల దాఁచేవు
పుచ్చుకా శ్రీవేంకటేశ కొమ్మ నినుఁ బెండ్లాడఁగా
విచ్చన విడాయ నేల వేఁడుకొనేవు
(||pallavi||)
ābĕ maṟam̐guna nīvemainām̐ jesinadi gaddo
pūm̐pa sannalane kaḍum̐bŏddulu vuchchĕnu
(||ābĕ||)
battisesi yāgĕ nībai padamulu vāḍam̐gānu
yittala nīviṁtalone yemi navvevu
kŏttagā siṁgāriṁchugŏnnaṁdugu mĕchcham̐gānu
sittagiṁchi nīvĕṁta sigguvaḍevu
(||ābĕ||)
kāyabu gurudulabai kastūri yalam̐darām̐gā
seyivaṭṭi priyālĕṁta sĕppavachchevu
sāyala nīvalabulu sārĕsārĕm̐ bŏgaḍam̐gā
āyamulu mosīnaṁṭā nānalela pĕṭṭevu
(||ābĕ||)
muchchaḍado nābĕ nīmovidenĕ lānam̐gānu
ichchagiṁchi palusom̐ku lela dām̐sevu
puchchugā śhrīveṁkaḍeśha kŏmma ninum̐ bĕṁḍlāḍam̐gā
vichchana viḍāya nela vem̐ḍugŏnevu