ఆపె మాఁటే నా మాటఁ అవునయ్యా
(॥పల్లవి॥)
ఆపె మాఁటే నా మాటఁ అవునయ్యా
యేపొద్దూ నిట్టే చనవియ్యవయ్యా
(॥॥)
నవ్వించినపుడే నాతి కోపమెల్లాఁ బాసె
రవ్వలుసేయక యిఁక రావయ్యా
దవ్వులఁ జేయి చాఁచితే తగులాయమెల్ల నాయ
వువ్విళ్ళూర సంగడిఁ గూచుండవయ్యా
(॥॥)
మాటాడించినప్పుడే మగువచలము దీరె
చీటికి మాటికి నిఁకఁ జెనకవయ్యా
సూటి గాఁగాఁ జూచితేనే సొంపులెల్లా సమకూడె
గాటముగ ముందుముందే కాఁగిలించవయ్యా
(॥॥)
చేరి మొక్కించినప్పుడే సిగ్గులెల్లాఁ దేరెను
జోరునఁ జెమట రతిఁ జొక్కించవయ్యా
యీరీతి శ్రీవేంకటేశ యెనసితి విన్నిటాను
నేరుపులెల్లా నిందే నెరపవయ్యా
(||pallavi||)
ābĕ mām̐ṭe nā māḍam̐ avunayyā
yebŏddū niṭṭe sanaviyyavayyā
(||||)
navviṁchinabuḍe nādi kobamĕllām̐ bāsĕ
ravvaluseyaga yim̐ka rāvayyā
davvulam̐ jeyi sām̐side tagulāyamĕlla nāya
vuvviḽḽūra saṁgaḍim̐ gūsuṁḍavayyā
(||||)
māḍāḍiṁchinappuḍe maguvasalamu dīrĕ
sīḍigi māḍigi nim̐kam̐ jĕnagavayyā
sūḍi gām̐gām̐ jūsidene sŏṁpulĕllā samagūḍĕ
gāḍamuga muṁdumuṁde kām̐giliṁchavayyā
(||||)
seri mŏkkiṁchinappuḍe siggulĕllām̐ derĕnu
jorunam̐ jĕmaḍa radim̐ jŏkkiṁchavayyā
yīrīdi śhrīveṁkaḍeśha yĕnasidi vinniḍānu
nerubulĕllā niṁde nĕrabavayyā