ఆపె కావలె నొండె అట్టె నేనే కావలె
(॥పల్లవి॥)
ఆపె కావలె నొండె అట్టె నేనే కావలె
యేపని కేపని సేసే విఁకనేడ సుద్దులు
(॥ఆపె॥)
గద్దరిచూపులఁ జూచి కన్నులనే మాటలాడి
తిద్దుకొనె నిన్నుఁ జేతికిలోనుగా
వొద్దనుండి మమ్మునేల వొడఁబరచేవు నీవు
యిద్దరికి నోపుదువా యిఁకనేడ సుద్దులు
(॥ఆపె॥)
వోరికొట్లు గొట్టి నిన్ను వొరసి చన్నులనొ త్తి
సారె నలవాటుసేసె జంట నీ కాపె
చేరిచేరి మమ్మునేల చెనకేవు నీ విప్పుడు
యేరా మమ్ముఁ గొసరే విఁకనేడ సుద్దులు
(॥ఆపె॥)
కమ్మటిని మోవి నీకిచ్చె కాఁగిటను బిగియించి
నమ్మించి దక్కఁగోనెను నవ్వుతా నిన్ను
దొమ్మిసేసి నను నీవు తొడిఁబడఁ గూడితివి
యెమ్మెల శ్రీవేంకటేశ యిఁకనేడ సుద్దులు
(||pallavi||)
ābĕ kāvalĕ nŏṁḍĕ aṭṭĕ nene kāvalĕ
yebani kebani sese vim̐kaneḍa suddulu
(||ābĕ||)
gaddarisūbulam̐ jūsi kannulane māḍalāḍi
tiddugŏnĕ ninnum̐ jedigilonugā
vŏddanuṁḍi mammunela vŏḍam̐barasevu nīvu
yiddarigi nobuduvā yim̐kaneḍa suddulu
(||ābĕ||)
vorigŏṭlu gŏṭṭi ninnu vŏrasi sannulanŏ tti
sārĕ nalavāḍusesĕ jaṁṭa nī kābĕ
seriseri mammunela sĕnagevu nī vippuḍu
yerā mammum̐ gŏsare vim̐kaneḍa suddulu
(||ābĕ||)
kammaḍini movi nīgichchĕ kām̐giḍanu bigiyiṁchi
nammiṁchi dakkam̐gonĕnu navvudā ninnu
dŏmmisesi nanu nīvu tŏḍim̐baḍam̐ gūḍidivi
yĕmmĕla śhrīveṁkaḍeśha yim̐kaneḍa suddulu