ఆపె గలిగుండఁగాను అనుమానాలిఁక నేల
(॥పల్లవి॥)
ఆపె గలిగుండఁగాను అనుమానాలిఁక నేల
కోపగించేమా నేము కొంకనేల నీకును
(॥ఆపె॥)
పూసగుచ్చినట్టు నీకు బుద్దులు చెప్పీ నాకె
వేసరక వినవయ్య వేమారును
ఆసలాసలఁ దిరిగే మంతనింత నీవెంట
వీసమంత మమ్ముఁ జూచి వెఱపేల నీకును
(॥ఆపె॥)
తెమలించి నీగుణాలు తిద్దుకవచ్చీ నాపె
అమర నడవవయ్య ఔఁ గాదనక
తమకించి నీ యింట తావై వుండేము నేము
విమలపు మమ్ముఁ జూచి వెఱపేల నీకును
(॥ఆపె॥)
నెయ్యమున నిన్నుఁగూడి నేరుపరిఁ జేసీ నాపె
ఇయ్యకోలు గొనవయ్య ఇందరిలోన
చయ్యనఁ గూడితిమి ఇచ్చటనే శ్రీ వేంకటేశ
వెయ్యయినా మమ్ముఁ జూచి వెఱపేల నీకును
(||pallavi||)
ābĕ galiguṁḍam̐gānu anumānālim̐ka nela
kobagiṁchemā nemu kŏṁkanela nīgunu
(||ābĕ||)
pūsaguchchinaṭṭu nīgu buddulu sĕppī nāgĕ
vesaraga vinavayya vemārunu
āsalāsalam̐ dirige maṁtaniṁta nīvĕṁṭa
vīsamaṁta mammum̐ jūsi vĕṟabela nīgunu
(||ābĕ||)
tĕmaliṁchi nīguṇālu tiddugavachchī nābĕ
amara naḍavavayya aum̐ gādanaga
tamagiṁchi nī yiṁṭa tāvai vuṁḍemu nemu
vimalabu mammum̐ jūsi vĕṟabela nīgunu
(||ābĕ||)
nĕyyamuna ninnum̐gūḍi nerubarim̐ jesī nābĕ
iyyagolu gŏnavayya iṁdarilona
sayyanam̐ gūḍidimi ichchaḍane śhrī veṁkaḍeśha
vĕyyayinā mammum̐ jūsi vĕṟabela nīgunu