Aabe eṟamganidaa amta neevu sese melu

ఆపె ఎఱఁగనిదా అంత నీవు సేసే మేలు
Language

(॥పల్లవి॥)
ఆపె ఎఱఁగనిదా అంత నీవు సేసే మేలు
తీపుల నీమోవి ఇచ్చి తిద్దుకొనరాదా

(॥ఆపె॥)
కూరిమిగలదానికి కోపము గలితేనేమి
చేరి యందులొనే చవి చేసుకోరాదా
నీరాక కెదురు చూచి నిన్నుఁ దిద్దితే నేమి
గారవించి నవ్వు నవ్వి కాఁగిలించరాదా

(॥ఆపె॥)
మనసిచ్చినదానికి మందెమేళమైతే నేమి
చెనకి యదె చవిచేసుకోరాదా
చనవు నీ వొసఁగఁగా జంకించితే నేమి
తనివంది రతుల చిత్తరిఁ జేయరాదా

(॥ఆపె॥)
పాయకున్న దానికి పంతమాడుకొంటే నేమి
సేయరాని సేవ చవిచేసుకోరాదా
యీయెడ శ్రీ వేంకటేశ యింతి నిట్టె కూడితివి
కాయముపై కళలంటి కడు మెచ్చరాదా

(||pallavi||)
ābĕ ĕṟam̐ganidā aṁta nīvu sese melu
tībula nīmovi ichchi tiddugŏnarādā

(||ābĕ||)
kūrimigaladānigi kobamu galidenemi
seri yaṁdulŏne savi sesugorādā
nīrāga kĕduru sūsi ninnum̐ diddide nemi
gāraviṁchi navvu navvi kām̐giliṁcharādā

(||ābĕ||)
manasichchinadānigi maṁdĕmeḽamaide nemi
sĕnagi yadĕ savisesugorādā
sanavu nī vŏsam̐gam̐gā jaṁkiṁchide nemi
tanivaṁdi radula sittarim̐ jeyarādā

(||ābĕ||)
pāyagunna dānigi paṁtamāḍugŏṁṭe nemi
seyarāni seva savisesugorādā
yīyĕḍa śhrī veṁkaḍeśha yiṁti niṭṭĕ kūḍidivi
kāyamubai kaḽalaṁṭi kaḍu mĕchcharādā