Aabe aadani buddi amdaalagum dechcheemgaani

ఆపె ఆతని బుద్ది అందాలకుఁ దెచ్చీఁగాని
Language

(॥పల్లవి॥)
ఆపె ఆతని బుద్ది అందాలకుఁ దెచ్చీఁగాని
కోపుల సారెసారెఁ గొసరకురే

(॥ఆపె॥)
మొగము చూచినప్పుడు మోహము రెట్టించీఁగాని
జిగి నందాఁకాఁ గక్కసించకురమ్మ
నగిన యప్పుడు తానే నయానకు వచ్చీఁగాని
పగటు బలిమిచూచి పంతములాడకురే

(॥ఆపె॥)
మాఁటలాడినప్పుడే మంకులు మానీఁగాని
గాఁటానఁ జేయివట్టి పెనఁగకురమ్మ
కూటమివేళనే మేలు కొనలుసాగీగాని
పాటించి సారె సారెకు బలిమి సేయకురే

(॥ఆపె॥)
యేకాంతమయినప్పుడే ఇయ్యకోలయ్యీఁగాని
చేకొని ఇంతేసి రట్టు సేయకురమ్మ
యీకడ శ్రీ వేంకటేశుఁ డింతిని గక్కునఁ గూడె
వాకిచ్చి మీరేమి నిఁక వంతులు వెట్టకురే

(||pallavi||)
ābĕ ādani buddi aṁdālagum̐ dĕchchīm̐gāni
kobula sārĕsārĕm̐ gŏsaragure

(||ābĕ||)
mŏgamu sūsinappuḍu mohamu rĕṭṭiṁchīm̐gāni
jigi naṁdām̐kām̐ gakkasiṁchaguramma
nagina yappuḍu tāne nayānagu vachchīm̐gāni
pagaḍu balimisūsi paṁtamulāḍagure

(||ābĕ||)
mām̐ṭalāḍinappuḍe maṁkulu mānīm̐gāni
gām̐ṭānam̐ jeyivaṭṭi pĕnam̐gaguramma
kūḍamiveḽane melu kŏnalusāgīgāni
pāḍiṁchi sārĕ sārĕgu balimi seyagure

(||ābĕ||)
yegāṁtamayinappuḍe iyyagolayyīm̐gāni
segŏni iṁtesi raṭṭu seyaguramma
yīgaḍa śhrī veṁkaḍeśhum̐ ḍiṁtini gakkunam̐ gūḍĕ
vāgichchi mīremi nim̐ka vaṁtulu vĕṭṭagure