Aabaraadu tamagamu atte ninnumjoosi

ఆపరాదు తమకము అట్టె నిన్నుఁజూచి
Language

(॥పల్లవి॥)
ఆపరాదు తమకము అట్టె నిన్నుఁజూచి
మోపరాదా నీ కరములు నా చన్నులను

(॥ఆప॥)
చోప్పుగా నెందాఁకా సుద్దు లడిగేవు మమ్ము
కప్పరాదా పచ్చడము గక్కన నీవు
అప్పటి విడేలిచ్చి ఆసల నేమివెట్టేవు
చెప్పి వూడిగాలేమైనాఁ జేయించుకొరాదా

(॥ఆప॥)
సారెసారె మాతోను సరసము లేమాడెవు
రారాదా పానుపుపైకి రంతులేఁటికి
వూరకె యేకతమున నుండి తమిరేఁచనేల
యీరాదా నీమోవితేనె లెంత నోరూరించేవు

(॥ఆప॥)
గుట్టుతోడ వలపులు గుబ్బతిలించనేఁటికి
పెట్టరాదా తమ్ములము పెనఁగనేల
అట్టె శ్రీవేంకటేశ అలమేల్‌మంగను నేను
గట్టిగా నన్నేలితి విక్కడనే వుండరాదా

(||pallavi||)
ābarādu tamagamu aṭṭĕ ninnum̐jūsi
mobarādā nī karamulu nā sannulanu

(||āba||)
soppugā nĕṁdām̐kā suddu laḍigevu mammu
kapparādā pachchaḍamu gakkana nīvu
appaḍi viḍelichchi āsala nemivĕṭṭevu
sĕppi vūḍigālemainām̐ jeyiṁchugŏrādā

(||āba||)
sārĕsārĕ mādonu sarasamu lemāḍĕvu
rārādā pānububaigi raṁtulem̐ṭigi
vūragĕ yegadamuna nuṁḍi tamirem̐sanela
yīrādā nīmovidenĕ lĕṁta norūriṁchevu

(||āba||)
guṭṭudoḍa valabulu gubbadiliṁchanem̐ṭigi
pĕṭṭarādā tammulamu pĕnam̐ganela
aṭṭĕ śhrīveṁkaḍeśha alamel‌maṁganu nenu
gaṭṭigā nannelidi vikkaḍane vuṁḍarādā