Aabaadi suttarige made saalu

ఆపాటి చుట్టరికె మదే చాలు
Language

(॥పల్లవి॥)
ఆపాటి చుట్టరికె మదే చాలు
కోప మేల కొంత మేల గుట్టున నుండెను

(॥ఆపాటి॥)
జాగుల కోపుదునా సమ్మతించఁ గలఁ గాక
వేగెఁ బొద్దు మాటలన్నీ విడు విడరే
బాగుగఁ దా నేడనైనా బతికితేఁ జాలుఁ గాక
చేగదేర దవ్వులఁ జూచెఁ దనమేలు

(॥ఆపాటి॥)
యెమ్మెల కోపుదునా యియ్యకొనఁ గలఁ గాక
నెమ్మి రాజసమే మీఱె నేరు పేటికే
చిమ్ముల నే చేఁతలై నాఁ జేసితేఁ జాలుఁగాక
తెమ్మగా వీనుల వినే తేజమే చాలునే

(॥ఆపాటి॥)
కాఁకల కోపుదునా కలయఁగఁ గలఁ గాక
వేఁకపు మరుఁడే సాక్షి వేసా లేటికే
యేఁకటి శ్రీవేంకటేశుఁ డింతలోనే నన్నుఁ గూడె
సోఁకుల నేనే మెచ్చె సొరిది లోలోనను

(||pallavi||)
ābāḍi suṭṭarigĕ made sālu
koba mela kŏṁta mela guṭṭuna nuṁḍĕnu

(||ābāḍi||)
jāgula kobudunā sammadiṁcham̐ galam̐ gāga
vegĕm̐ bŏddu māḍalannī viḍu viḍare
bāgugam̐ dā neḍanainā badigidem̐ jālum̐ gāga
segadera davvulam̐ jūsĕm̐ danamelu

(||ābāḍi||)
yĕmmĕla kobudunā yiyyagŏnam̐ galam̐ gāga
nĕmmi rājasame mīṟĕ neru peḍige
simmula ne sem̐talai nām̐ jesidem̐ jālum̐gāga
tĕmmagā vīnula vine tejame sālune

(||ābāḍi||)
kām̐kala kobudunā kalayam̐gam̐ galam̐ gāga
vem̐kabu marum̐ḍe sākṣhi vesā leḍige
yem̐kaḍi śhrīveṁkaḍeśhum̐ ḍiṁtalone nannum̐ gūḍĕ
som̐kula nene mĕchchĕ sŏridi lolonanu