Aa suddu lanniyum jeli nadugaraadaa

ఆ సుద్దు లన్నియుఁ జెలి నడుగరాదా
Language

(॥పల్లవి॥)
ఆ సుద్దు లన్నియుఁ జెలి నడుగరాదా
సేసవెట్టితివి నీచేతిదాయ వలపు

(॥॥)
పొంకముగా నెవ్వతెతో పొందుసేసి వచ్చితివో
జంకెన చూపుల నీకె సాదించీని
లంకెల నప్పటి మరి లచ్చన లేమిగనెనో
వుంకువ మోవెంటించితే వొడ్డుకొనీని

(॥॥)
మేరమీర వింతసొమ్ము మేన నీ కెంత వున్నదో
నారుకొన సెలవుల నవ్వు నవ్వీని
పేరుకొని యేవనిత పిలువఁ గ వినెనో
వూరకే మాటాడఁ గాఁ జెవులు మూసుకొనీని

(॥॥)
వురము గందమెవ్వరి వొడల మెత్తినదో
గరిమఁ గాఁగిలించితే కడులోఁ గీని
మరిగి శ్రీ వేంకటేశ మనసెట్టు దెలిసెనో
సరుగ నిన్నుఁ గూడి సన్న సేసీని

(||pallavi||)
ā suddu lanniyum̐ jĕli naḍugarādā
sesavĕṭṭidivi nīsedidāya valabu

(||||)
pŏṁkamugā nĕvvadĕdo pŏṁdusesi vachchidivo
jaṁkĕna sūbula nīgĕ sādiṁchīni
laṁkĕla nappaḍi mari lachchana lemiganĕno
vuṁkuva movĕṁṭiṁchide vŏḍḍugŏnīni

(||||)
meramīra viṁtasŏmmu mena nī kĕṁta vunnado
nārugŏna sĕlavula navvu navvīni
perugŏni yevanida piluvam̐ ga vinĕno
vūrage māḍāḍam̐ gām̐ jĕvulu mūsugŏnīni

(||||)
vuramu gaṁdamĕvvari vŏḍala mĕttinado
garimam̐ gām̐giliṁchide kaḍulom̐ gīni
marigi śhrī veṁkaḍeśha manasĕṭṭu dĕlisĕno
saruga ninnum̐ gūḍi sanna sesīni