(॥పల్లవి॥)
ఆ రమణి వుండగాను అంతేకాదా
బారలు చాఁచే వప్పటి పయికొసరా నేను
(॥ఆర॥)
నీసతి వెంట వచ్చిననెలతఁనంటానా
ఆసపడి జాణతనాలాడేవు నీవు
సేసవెట్టి పెండ్లాడిన చెలియనుఁ గూడితివి
బాసయిచ్చి చెనకేవు పయికొసరా నేను
(॥ఆర॥)
నీ కాపెమాట చెప్పిననేస్తకతైనంటానా
కైకొన నాకు సన్నలు గావించేవు
లోకమెల్లా నెఱఁగఁగా లోనఁబెట్టుకొంటి వాపెఁ
బైకొని నాతో నవ్వేవు పఇకొసరా నేను
(॥ఆర॥)
ప్రియరాలి వొద్ది తోడఁబెండ్లి కూఁతురనంటానా
నయమై శ్రీవేంకటేశ నన్నుఁ గూడితి
దయతో నాపె నేలి మంతనమాడితి విందాఁకా
భయము దీర్చితి విట్టె పయికొసరా నేను
(||pallavi||)
ā ramaṇi vuṁḍagānu aṁtegādā
bāralu sām̐se vappaḍi payigŏsarā nenu
(||āra||)
nīsadi vĕṁṭa vachchinanĕladam̐naṁṭānā
āsabaḍi jāṇadanālāḍevu nīvu
sesavĕṭṭi pĕṁḍlāḍina sĕliyanum̐ gūḍidivi
bāsayichchi sĕnagevu payigŏsarā nenu
(||āra||)
nī kābĕmāḍa sĕppinanestagadainaṁṭānā
kaigŏna nāgu sannalu gāviṁchevu
logamĕllā nĕṟam̐gam̐gā lonam̐bĕṭṭugŏṁṭi vābĕm̐
baigŏni nādo navvevu pa̮igŏsarā nenu
(||āra||)
priyarāli vŏddi toḍam̐bĕṁḍli kūm̐turanaṁṭānā
nayamai śhrīveṁkaḍeśha nannum̐ gūḍidi
dayado nābĕ neli maṁtanamāḍidi viṁdām̐kā
bhayamu dīrsidi viṭṭĕ payigŏsarā nenu