Aa mooridiye yee mooridi amdu nimdu bhedamu ledu

ఆ మూరితియే యీ మూరితి అందు నిందు భేదము లేదు
Language

(॥పల్లవి॥)
ఆ మూరితియే యీ మూరితి అందు నిందు భేదము లేదు
సోమర్కనేత్రుఁడ విశ్వరూపములు చూచినవారమే మును నేము

(॥ఆ మూరి॥)
బలిమితోడ వత్సాపహరణమున బ్రహ్మకు నీ మాయ చూపితివి
విలసిల్లఁగ రణభూమిని నరునకు విశ్వరూప మటు చూపితివి
అలరిన నీ రూపు జలమధ్యంబున ఆక్రూరున కటు చూపితివి
చెలఁగి కుమారస్వామికి నా రూపు శ్రీవేంకటగిరిఁ జూపితివి

(॥ఆ మూరి॥)
దైవికముగ దుర్యోధను సభను ప్రతాపము నీ రూపు చూపితివి
ఆ విధముననే నీరూపు ముదంకు నా శ్రమమున నీటు చూపితివి
నీవిధ మెఱుఁగని భీష్మకునకు మఱి నిర్మలరూపము చూపితివి
శ్రీవేంకటగిరి నారూపంబే చేరి పరుషలకుఁ జూపితివి

(॥ఆ మూరి॥)
పుట్టినప్పుడే వసుదేవునకు చతుర్భుజముల నీ రూపు చూపితివి
జట్టిగ గొల్లెతలకు రూపము రా సక్రీడలలోఁ జూపితివి
యిట్టే నారదునకు ద్వారకలొ యింటింట నీ రూపు చూపితివి
పట్టుగ శ్రీవేంకటేవ్వర ఆ రూపమె మాకిప్పుడు చూపితివి

(||pallavi||)
ā mūridiye yī mūridi aṁdu niṁdu bhedamu ledu
somarganetrum̐ḍa viśhvarūbamulu sūsinavārame munu nemu

(||ā mūri||)
balimidoḍa vatsābaharaṇamuna brahmagu nī māya sūbidivi
vilasillam̐ga raṇabhūmini narunagu viśhvarūba maḍu sūbidivi
alarina nī rūbu jalamadhyaṁbuna ākrūruna kaḍu sūbidivi
sĕlam̐gi kumārasvāmigi nā rūbu śhrīveṁkaḍagirim̐ jūbidivi

(||ā mūri||)
daivigamuga duryodhanu sabhanu pradābamu nī rūbu sūbidivi
ā vidhamunane nīrūbu mudaṁku nā śhramamuna nīḍu sūbidivi
nīvidha mĕṟum̐gani bhīṣhmagunagu maṟi nirmalarūbamu sūbidivi
śhrīveṁkaḍagiri nārūbaṁbe seri paruṣhalagum̐ jūbidivi

(||ā mūri||)
puṭṭinappuḍe vasudevunagu sadurbhujamula nī rūbu sūbidivi
jaṭṭiga gŏllĕdalagu rūbamu rā sakrīḍalalom̐ jūbidivi
yiṭṭe nāradunagu dvāragalŏ yiṁṭiṁṭa nī rūbu sūbidivi
paṭṭuga śhrīveṁkaḍevvara ā rūbamĕ māgippuḍu sūbidivi