(॥పల్లవి॥)
ఆ మీఁది పనులు నన్నడుగనేల
చే ముట్టి మీకు బుద్ది చెప్పితి నింతే
(॥ఆమీఁ॥)
కాదనేదానఁగాను కైకొలిపేదానఁగాను
గీద పోరి యేల సాకిరి గోరేవు
వాదడువకుఁ డనుచు వద్దనుండి నీవు నీవు
తోదోపు లాడఁగాను దొబ్బితి నింతే
(॥ఆమీఁ॥)
ఱట్టయి మీతగవు దిద్ద ఱాతిగుండెదానఁగాను
వట్టియానలేల నాకుఁ బెట్టేరు మీరు
చెట్టవట్టి మీరిద్దరు సేసేఁమీలోని
చిట్టకాలు పాదమునఁ జిమ్మితి నింతే
(॥ఆమీఁ॥)
లోచి వెలదానను లోనయినదానను
యీచాయ నన్నుఁగూడి యీ యింతిఁ గూడేవు
చే చేతఁ బెనఁగఁగ శ్రీ వేంకటేశుఁడ మిమ్ము
చూచి చూచి మీనేరుపు సోదించితి నింతే
(||pallavi||)
ā mīm̐di panulu nannaḍuganela
se muṭṭi mīgu buddi sĕppidi niṁte
(||āmīm̐||)
kādanedānam̐gānu kaigŏlibedānam̐gānu
gīda pori yela sāgiri gorevu
vādaḍuvagum̐ ḍanusu vaddanuṁḍi nīvu nīvu
todobu lāḍam̐gānu dŏbbidi niṁte
(||āmīm̐||)
ṟaṭṭayi mīdagavu didda ṟādiguṁḍĕdānam̐gānu
vaṭṭiyānalela nāgum̐ bĕṭṭeru mīru
sĕṭṭavaṭṭi mīriddaru sesem̐mīloni
siṭṭagālu pādamunam̐ jimmidi niṁte
(||āmīm̐||)
losi vĕladānanu lonayinadānanu
yīsāya nannum̐gūḍi yī yiṁtim̐ gūḍevu
se sedam̐ bĕnam̐gam̐ga śhrī veṁkaḍeśhum̐ḍa mimmu
sūsi sūsi mīnerubu sodiṁchidi niṁte