పల్లవి:
నూటికో కోటికో ఒక్కరు... ఎప్పుడో ఎక్కడో పుడతారు

అది మీరే మీరే మాస్టారు... మా దేవుడు మీరే మాస్టారు

చరణం 1:
దారే దొరకని చీకటిలో తానే వెలుగై నడిచాడు...
జాతే నా వెలుగన్నాడు జాతిపిత మన జాతిపిత...
దిక్కులు తెలియని సమయంలో...
తానే దిక్కుగ నిలిచాడు శాంతిని నేతగ నిలిపాడు...
శాంతిదూత మన శాంతిదూత...
ఆ జాతిపిత బాపూజీ మీలో వెలిశాడు....
ఆ శాంతి దూత నెహ్రూజీ మీలో కలిశాడు....
ఎందరో ఇంకెందరో మీలో ఉన్నారు....
మా దేముడు మీరే మాస్టారు.... మా దేముడు మీరే మాస్టారు
నూటికో కోటికో ఒక్కరు... ఎప్పుడో ఎక్కడో పుడతారు
చరణం 2:
జరిగే జీవిత సమరంలో జారే నైతిక విలువల్లో
నీతిని నేతగా నిలపాలి నవయువత.. యువనేత..
చుక్కలు మాడే గుండె.. నిప్పులు వెలగని గుడిసెల్లో
ఆశను జ్యోతిగా నిలపాలి నవయువత.. యువనేత..
ఈ యువత తాత గాంధీజీ మీలో మిగిలారు
మీ నవతకు నేతాజీ మీలో రగిలారు
అందరూ ఆ అందరూ మీలో ఉన్నారు
దేశానికి మీరే సారధులు... దేశానికి మీరే సారధులు