పల్లవి:
విరిసినదీ వసంత గానం వలపుల పల్లవిగా
విరిసినదీ వసంత గానం వలపుల పల్లవిగా
మనసే మందారమై .....వయసే మకరందమై
అదేదో మాయ చేసినదీ
చరణం 1:
ఝుమ్మందినాదం రతివేదం జతకోరే భ్రమర రాగం
రమ్మంది మోహం ఒక దాహం మరులూరే భ్రమలమైకం
పరువాల వాహినీ ప్రవహించె ఈవనీ
ప్రభవించె ఆమనీ పులకించె కామినీ
వసంతుడే చెకాంతుడై దరిచేరె మెల్లగా
చరణం 2:
రుతువు మహిమేమో విరితేనె జడివానై కురిసె తీయగా
లతలు పెనవేయ మైమరచి మురిసేను తరువు హాయిగా
రా చిలుక పాడగా రాయంచ ఆడగా
రసలీల తోడుగా తనువెల్ల ఊగగా
మారుడే సుకుమారుడై జతకూడె మాయగా...
pallavi:
virisinadī vasaṁta gānaṁ valabula pallavigā
virisinadī vasaṁta gānaṁ valabula pallavigā
manase maṁdāramai .....vayase magaraṁdamai
adedo māya sesinadī
saraṇaṁ 1:
jhummaṁdinādaṁ radivedaṁ jadagore bhramara rāgaṁ
rammaṁdi mohaṁ ŏga dāhaṁ marulūre bhramalamaigaṁ
paruvāla vāhinī pravahiṁchĕ īvanī
prabhaviṁchĕ āmanī pulagiṁchĕ kāminī
vasaṁtuḍe sĕgāṁtuḍai dariserĕ mĕllagā
saraṇaṁ 2:
ruduvu mahimemo viridenĕ jaḍivānai kurisĕ tīyagā
ladalu pĕnaveya maimarasi murisenu taruvu hāyigā
rā siluga pāḍagā rāyaṁcha āḍagā
rasalīla toḍugā tanuvĕlla ūgagā
māruḍe sugumāruḍai jadagūḍĕ māyagā...