Vinnabaalu vinamani vachchenayya annamayya

విన్నపాలు వినమని వచ్చెనయ్య అన్నమయ్య
Year
Language

పల్లవి:

విన్నపాలు వినమని వచ్చెనయ్య అన్నమయ్య
పన్నగపు తెరతీయ వెన్నునితో చెప్పవయ్య
ఏ.. అన్నమయ్య ఆయన పాటల్లో పాడుకోలేడా
చెప్పడానికి నేనెవరిని

ఆ పాటల్లో రాగాలన్నీ నీవేనయ్యా
ఆ మాటల్లో భావాలన్నీ నీవేనయ్యా
ఆ పాటల్లో రాగాలన్నీ నీవేనయ్యా
ఆ మాటల్లో భావాలన్నీ నీవేనయ్యా
హరినే కొలిచా నిను పిలిచే వేళల్లో
సిరినే చూశా నీ నవ్వుల వెలుగుల్లో
నీవే సత్యం శివం సుందరం

ఆ పాటల్లో రాగాలన్నీ నీవేనయ్యా
ఆ మాటల్లో భావాలన్నీ నీవేనయ్యా

చరణం 1:

సూరిడువీ నీవే మము మేలుకొలుపు వేళ
సువ్వి సువ్వి సువ్వలాల సువ్వి సువ్వి
సందమామ నీవే మా జోల పాడు వేళ
సువ్వి సువ్వి సువ్వలాల సువ్వి సువ్వి
సూరిడువీ నీవే మము మేలుకొలుపు వేళ
సందమామ నీవే మా జోల పాడు వేళ
అన్నా అనాలా మాకు నువ్వే అన్నీ అనాలా
అన్నా అనాలా మాకు నువ్వే అన్నీ అనాలా
పసిపాప పలుకులా పరమాత్మ ఉనికిలా
చలువ చెలిమి చిలికినావు నీవే
సత్యం శివం సుందరం

మా పాటల్లో రాగాలన్నీ నీవేనయ్యా
మా మాటల్లో భావాలన్నీ నీవేనయ్యా

చరణం 2:

అమ్మతనము నీది మా ఆకలి తీర్చే వేళ
సువ్వి సువ్వి సువ్వలాల సువ్వి సువ్వి
నాన్న గుణము నీది మా అల్లరి ఆపే వేళ
సువ్వి సువ్వి సువ్వలాల సువ్వి సువ్వి
అమ్మతనము నాదా మీ ఆకలి తీర్చే వేళ
నాన్న గుణము నాదా మీ అల్లరి ఆపే వేళ
ఏ చుట్టరికం లేదే చుట్టుపక్కలా
ఏ మంత్రం వేసి మమ్ము చుట్టేశావిలా
అమ్మమ్మమ్మ చాలమ్మా అమ్మమ్మమ్మ ఆపమ్మా
అన్నెమెరుగను పున్నెమెరుగను అమ్మా చూడు ఈ గొగొగొ..గోల
అయ్యయ్యయ్యో ఓ అయ్యో..
ఏదేదో అంటున్నారు కాదని చెప్పవేల
అలా ఇలా ఎలా అన్నా కర్తవు నువ్వేగా నా వెనకాల
చాల్లే ఊరుకోరా మధ్యలో నేనెవరిని

నా పాటల్లో రాగాలన్నీ నువ్వేనమ్మా
నా మాటల్లో భావాలన్నీ నువ్వేనమ్మా
హరినే కొలిచా నిను పిలిచే వేళల్లో
సిరినే చూశా నీ నవ్వుల వెలుగుల్లో
నీవే సత్యం శివం సుందరం
మా పాటల్లో రాగాలన్నీ నువ్వేనమ్మా
మా మాటల్లో భావాలన్నీ నువ్వేనమ్మా

pallavi:

vinnabālu vinamani vachchĕnayya annamayya
pannagabu tĕradīya vĕnnunido sĕppavayya
e.. annamayya āyana pāḍallo pāḍugoleḍā
sĕppaḍānigi nenĕvarini

ā pāḍallo rāgālannī nīvenayyā
ā māḍallo bhāvālannī nīvenayyā
ā pāḍallo rāgālannī nīvenayyā
ā māḍallo bhāvālannī nīvenayyā
harine kŏlisā ninu pilise veḽallo
sirine sūśhā nī navvula vĕlugullo
nīve satyaṁ śhivaṁ suṁdaraṁ

ā pāḍallo rāgālannī nīvenayyā
ā māḍallo bhāvālannī nīvenayyā

saraṇaṁ 1:

sūriḍuvī nīve mamu melugŏlubu veḽa
suvvi suvvi suvvalāla suvvi suvvi
saṁdamāma nīve mā jola pāḍu veḽa
suvvi suvvi suvvalāla suvvi suvvi
sūriḍuvī nīve mamu melugŏlubu veḽa
saṁdamāma nīve mā jola pāḍu veḽa
annā anālā māgu nuvve annī anālā
annā anālā māgu nuvve annī anālā
pasibāba palugulā paramātma unigilā
saluva sĕlimi siligināvu nīve
satyaṁ śhivaṁ suṁdaraṁ

mā pāḍallo rāgālannī nīvenayyā
mā māḍallo bhāvālannī nīvenayyā

saraṇaṁ 2:

ammadanamu nīdi mā āgali tīrse veḽa
suvvi suvvi suvvalāla suvvi suvvi
nānna guṇamu nīdi mā allari ābe veḽa
suvvi suvvi suvvalāla suvvi suvvi
ammadanamu nādā mī āgali tīrse veḽa
nānna guṇamu nādā mī allari ābe veḽa
e suṭṭarigaṁ lede suṭṭubakkalā
e maṁtraṁ vesi mammu suṭṭeśhāvilā
ammammamma sālammā ammammamma ābammā
annĕmĕruganu punnĕmĕruganu ammā sūḍu ī gŏgŏgŏ..gola
ayyayyayyo o ayyo..
ededo aṁṭunnāru kādani sĕppavela
alā ilā ĕlā annā kardavu nuvvegā nā vĕnagāla
sālle ūrugorā madhyalo nenĕvarini

nā pāḍallo rāgālannī nuvvenammā
nā māḍallo bhāvālannī nuvvenammā
harine kŏlisā ninu pilise veḽallo
sirine sūśhā nī navvula vĕlugullo
nīve satyaṁ śhivaṁ suṁdaraṁ
mā pāḍallo rāgālannī nuvvenammā
mā māḍallo bhāvālannī nuvvenammā