Vevela gobemmala muvvagobaalude

వేవేల గోపెమ్మల మువ్వగోపాలుడే
Year
Language

పల్లవి:

వేవేల గోపెమ్మల మువ్వగోపాలుడే మా ముద్దు గోవిందుడే
మువ్వగోపాలుడే... మా ముద్దు గోవిందుడే
అహ అన్నుల మిన్నుల కన్నుల వెన్నెల
వేణువులూదాడే ...మది వెన్నెలు దోచాడే

అహహ వేవేల గోపెమ్మల మువ్వగోపాలుడే
మా ముద్దు గోవిందుడే

చరణం 1:

మన్ను తిన్న చిన్నవాడే... మిన్ను కన్న వన్నెకాడె..
మన్ను తిన్న చిన్నవాడే ...మిన్ను కన్న వన్నెకాడె ..

కన్న తోడు లేనివాడే.... కన్నె తోడు వున్నవాడె
మోహనాల వేణువూదే... మోహనాంగుడితడేనే
మోహనాల వేణువూదే... మోహనంబుడితడేనే ..

చీరలన్నీ దోచి దేహ చింతలన్నీ తీర్చినాడే
పోతన్న కైతలన్నీ పోతపోసుకున్నాడే...
మా మువ్వగోపాలుడే ...మా ముద్దు గోవిందుడే
ఆ..అహహహ వేవేల గోపెమ్మల మువ్వ గోపాలుడే...
మా ముద్దు గోవిందుడే...

చరణం 2:

వేయి పేరులున్నవాడే ...వేల తీరులున్నవాడే..ఏ...
వేయి పేరులున్నవాడే... వేల తీరులున్నవాడే ...
రాస లీలలాడినాడే ...రాయబారమేగినాడే ...

గీతార్థ సారమిచ్చి ...గీతలెన్నో మార్చేనే
గీతార్థ సారమిచ్చి ...గీతలెన్నో మార్చేనే
నీలమై.. నిఖిలమై... కాలమై... నిలిచాడే
వరదయ్య గానాల ...వరదలై పొంగాడే ...
మా మువ్వగోపాలుడే ...మా ముద్దు గోవిందుడే

ఆ..అహహహ వేవేల గోపెమ్మల మువ్వగోపాలుడే
మా ముద్దు గోవిందుడే...
అహ అన్నుల మిన్నుల కన్నుల వెన్నెల...
వేణువులూదాడే ...మది వెన్నెలు దోచాడే...
అహ అన్నుల మిన్నుల కన్నుల వెన్నెల
వేణువులూదాడే ...మది వెన్నెలు దోచాడే
ఆ..అహహహ వేవేల గోపెమ్మల మువ్వ గోపాలుడే ...
మా ముద్దు గోవిందుడే...

pallavi:

vevela gobĕmmala muvvagobāluḍe mā muddu goviṁduḍe
muvvagobāluḍe... mā muddu goviṁduḍe
aha annula minnula kannula vĕnnĕla
veṇuvulūdāḍe ...madi vĕnnĕlu dosāḍe

ahaha vevela gobĕmmala muvvagobāluḍe
mā muddu goviṁduḍe

saraṇaṁ 1:

mannu tinna sinnavāḍe... minnu kanna vannĕgāḍĕ..
mannu tinna sinnavāḍe ...minnu kanna vannĕgāḍĕ ..

kanna toḍu lenivāḍe.... kannĕ toḍu vunnavāḍĕ
mohanāla veṇuvūde... mohanāṁguḍidaḍene
mohanāla veṇuvūde... mohanaṁbuḍidaḍene ..

sīralannī dosi deha siṁtalannī tīrsināḍe
podanna kaidalannī podabosugunnāḍe...
mā muvvagobāluḍe ...mā muddu goviṁduḍe
ā..ahahaha vevela gobĕmmala muvva gobāluḍe...
mā muddu goviṁduḍe...

saraṇaṁ 2:

veyi perulunnavāḍe ...vela tīrulunnavāḍe..e...
veyi perulunnavāḍe... vela tīrulunnavāḍe ...
rāsa līlalāḍināḍe ...rāyabāramegināḍe ...

gīdārdha sāramichchi ...gīdalĕnno mārsene
gīdārdha sāramichchi ...gīdalĕnno mārsene
nīlamai.. nikhilamai... kālamai... nilisāḍe
varadayya gānāla ...varadalai pŏṁgāḍe ...
mā muvvagobāluḍe ...mā muddu goviṁduḍe

ā..ahahaha vevela gobĕmmala muvvagobāluḍe
mā muddu goviṁduḍe...
aha annula minnula kannula vĕnnĕla...
veṇuvulūdāḍe ...madi vĕnnĕlu dosāḍe...
aha annula minnula kannula vĕnnĕla
veṇuvulūdāḍe ...madi vĕnnĕlu dosāḍe
ā..ahahaha vevela gobĕmmala muvva gobāluḍe ...
mā muddu goviṁduḍe...