పల్లవి:
వేణువై వచ్చాను భువనానికి గాలినైపోతాను గగనానికి
వేణువై వచ్చాను భువనానికి గాలినైపోతాను గగనానికి
మమతలన్నీ మౌనగానం వాంఛలన్నీ వాయులీనం
వేణువై వచ్చాను భువనానికి గాలినైపోతాను గగనానికి
మాతృదేవోభవ ..మాతృదేవోభవ
పితృదేవోభవ..పితృదేవోభవ
ఆచార్యదేవోభవ..ఆచార్యదేవోభవ
చరణం 1:
ఏడుకొండలకైనా బండ తానొక్కడే
ఏడు జన్మల తీపి ఈ బంధమే ||2||
నీ కంటిలో నలక లోవెలుగు నేగనక
నేను మేననుకుంటే ఎద చీకటి హరీ హరీ.....హరీ
రాయినై ఉన్నాను ఈనాటికీ రామ పాదము రాక ఏనాటికీ..
వేణువై వచ్చాను భువనానికి గాలినైపోతాను గగనానికి
చరణం 2:
నీరు కన్నీరాయే ఊపిరే బరువాయె
నిప్పు నిప్పుగ మారె నా గుండెలో ||2||
ఆ నింగిలో కలిసి నా శూన్యబంధాలు
పుట్టిల్లు చేరే మట్టి ప్రాణాలు
హరీ... హరీ... హరీ..
రెప్పనై ఉన్నాను మీ కంటికి పాపనై వస్తాను మీ ఇంటికి...
వేణువై వచ్చాను భువనానికి గాలినైపోయాను గగనానికి
pallavi:
veṇuvai vachchānu bhuvanānigi gālinaibodānu gaganānigi
veṇuvai vachchānu bhuvanānigi gālinaibodānu gaganānigi
mamadalannī maunagānaṁ vāṁchhalannī vāyulīnaṁ
veṇuvai vachchānu bhuvanānigi gālinaibodānu gaganānigi
mātṛdevobhava ..mātṛdevobhava
pitṛdevobhava..pitṛdevobhava
āsāryadevobhava..āsāryadevobhava
saraṇaṁ 1:
eḍugŏṁḍalagainā baṁḍa tānŏkkaḍe
eḍu janmala tībi ī baṁdhame ||2||
nī kaṁṭilo nalaga lovĕlugu neganaga
nenu menanuguṁṭe ĕda sīgaḍi harī harī.....harī
rāyinai unnānu īnāḍigī rāma pādamu rāga enāḍigī..
veṇuvai vachchānu bhuvanānigi gālinaibodānu gaganānigi
saraṇaṁ 2:
nīru kannīrāye ūbire baruvāyĕ
nippu nippuga mārĕ nā guṁḍĕlo ||2||
ā niṁgilo kalisi nā śhūnyabaṁdhālu
puṭṭillu sere maṭṭi prāṇālu
harī... harī... harī..
rĕppanai unnānu mī kaṁṭigi pābanai vastānu mī iṁṭigi...
veṇuvai vachchānu bhuvanānigi gālinaiboyānu gaganānigi