Vennelainaa.. seegadainaa

వెన్నెలైనా.. చీకటైనా
Year
Language

పల్లవి:

ఆ..ఆ..ఆ..

వెన్నెలైనా.. చీకటైనా.. చేరువైనా.. దూరమైనా
నీతోనే జీవితము.. నీ ప్రేమే శాశ్వతము
ఏ జన్మదో ఈ బంధము.. ఏ జన్మదో ఈ బంధము
నింగి నేల సాక్ష్యాలు.. నింగి నేల సాక్ష్యాలు
ప్రేమకు మనమే తీరాలు

వెన్నెలైనా.. చీకటైనా.. చేరువైనా.. దూరమైనా
నీతోనే జీవితము.. నీ ప్రేమే శాశ్వతము

చరణం 1:

జ్ఞాపకమేదో.. నీడల్లె తారాడే.. స్వప్నాలేవో.. నీ కళ్ళ దోగాడే
కౌగిలింతలోన గాలి ఆడకూడదు.. చుక్కలైన నిన్ను నన్ను చూడకూడదు
నీ సర్వమూ.. నాదైనదీ..
నేను దేహమల్లె.. నీవు ప్రాణమల్లె ఏకమైన రాసలీలలోనా..

వెన్నెలైనా.. చీకటైనా.. చేరువైనా.. దూరమైనా

చరణం 2:

అంతంలేనీ.. నీ రాగ బంధంలో.. అంచున నిలిచీ.. నీ వైపే చూస్తున్నా
పున్నమింత కట్టుకున్న పూలడోలలు.. ఎన్నడింక చెప్పవమ్మ బాలసారలు
ఆ ముద్దులే.. మూడైనవీ..
బాలచంద్రుడొస్తే.. నూలుపోగులిస్తా.. ఇంటి దీపమయ్యేదింకా ప్రేమా

వెన్నెలైనా.. చీకటైనా.. చేరువైనా.. దూరమైనా
నీతోనే జీవితము.. నీ ప్రేమే శాశ్వతము
ఏ జన్మదో ఈ బంధము.. ఏ జన్మదో ఈ బంధము
నింగి నేల సాక్ష్యాలు.. నింగి నేల సాక్ష్యాలు
ప్రేమకు మనమే తీరాలు..

pallavi:

ā..ā..ā..

vĕnnĕlainā.. sīgaḍainā.. seruvainā.. dūramainā
nīdone jīvidamu.. nī preme śhāśhvadamu
e janmado ī baṁdhamu.. e janmado ī baṁdhamu
niṁgi nela sākṣhyālu.. niṁgi nela sākṣhyālu
premagu maname tīrālu

vĕnnĕlainā.. sīgaḍainā.. seruvainā.. dūramainā
nīdone jīvidamu.. nī preme śhāśhvadamu

saraṇaṁ 1:

jñābagamedo.. nīḍallĕ tārāḍe.. svapnālevo.. nī kaḽḽa dogāḍe
kaugiliṁtalona gāli āḍagūḍadu.. sukkalaina ninnu nannu sūḍagūḍadu
nī sarvamū.. nādainadī..
nenu dehamallĕ.. nīvu prāṇamallĕ egamaina rāsalīlalonā..

vĕnnĕlainā.. sīgaḍainā.. seruvainā.. dūramainā

saraṇaṁ 2:

aṁtaṁlenī.. nī rāga baṁdhaṁlo.. aṁchuna nilisī.. nī vaibe sūstunnā
punnamiṁta kaṭṭugunna pūlaḍolalu.. ĕnnaḍiṁka sĕppavamma bālasāralu
ā muddule.. mūḍainavī..
bālasaṁdruḍŏste.. nūlubogulistā.. iṁṭi dībamayyediṁkā premā

vĕnnĕlainā.. sīgaḍainā.. seruvainā.. dūramainā
nīdone jīvidamu.. nī preme śhāśhvadamu
e janmado ī baṁdhamu.. e janmado ī baṁdhamu
niṁgi nela sākṣhyālu.. niṁgi nela sākṣhyālu
premagu maname tīrālu..