వెన్నెల వెన్నెల మెల్లగా రావే పూవుల త
పల్లవి:
వెన్నెల వెన్నెల మెల్లగా రావే పూవుల తేనెలే తేవే
వెన్నెల వెన్నెల మెల్లగా రావే పూవుల తేనెలే తేవే
కడలి ఒడిలో నదులు ఒదిగి నిదురపోయే వేళా
కనుల పైన కలలే వాలి సోలిపోయే వేళా
వెన్నెల వెన్నెల మెల్లగా రావే పూవుల తేనెలే తేవే
చరణం 1:
ఆశ ఎన్నడు విడువదా అడగరాదని తెలియదా
నా ప్రాణం చెలియా నీవేలే
విరగబూసిన వెన్నెల వదిలివేయకే నన్నిలా
రా రా దా ఎద నీదే కాదా
నిదురనిచ్చే జాబిలి నిదుర లేక నీవే వాడినావా...
వెన్నెల వెన్నెల మెల్లగా రావే పూవుల తేనెలే తేవే
చరణం 2:
మంచు తెరలో అలలిసిపోయి...మదన సంధ్య తూగెనే
పుడమి ఒడిలో కలలు కంటూ...పాపా నీవు నిదురపో
మల్లె అందం మగువకెరుక..మనసు బాధ తెలియదా
గుండెనిండా ఊసులే నీ ఎదుటనుంటే మౌనమే
జోలపాట పాడినానే నిదుర లేక వాడినా...
వెన్నెల వెన్నెల మెల్లగా రావే పూవుల తేనెలే తేవే
వెన్నెల వెన్నెల మెల్లగా రావే పూవుల తేనెలే తేవే
pallavi:
vĕnnĕla vĕnnĕla mĕllagā rāve pūvula tenĕle teve
vĕnnĕla vĕnnĕla mĕllagā rāve pūvula tenĕle teve
kaḍali ŏḍilo nadulu ŏdigi niduraboye veḽā
kanula paina kalale vāli soliboye veḽā
vĕnnĕla vĕnnĕla mĕllagā rāve pūvula tenĕle teve
saraṇaṁ 1:
āśha ĕnnaḍu viḍuvadā aḍagarādani tĕliyadā
nā prāṇaṁ sĕliyā nīvele
viragabūsina vĕnnĕla vadiliveyage nannilā
rā rā dā ĕda nīde kādā
niduranichche jābili nidura lega nīve vāḍināvā...
vĕnnĕla vĕnnĕla mĕllagā rāve pūvula tenĕle teve
saraṇaṁ 2:
maṁchu tĕralo alalisiboyi...madana saṁdhya tūgĕne
puḍami ŏḍilo kalalu kaṁṭū...pābā nīvu nidurabo
mallĕ aṁdaṁ maguvagĕruga..manasu bādha tĕliyadā
guṁḍĕniṁḍā ūsule nī ĕduḍanuṁṭe mauname
jolabāḍa pāḍināne nidura lega vāḍinā...
vĕnnĕla vĕnnĕla mĕllagā rāve pūvula tenĕle teve
vĕnnĕla vĕnnĕla mĕllagā rāve pūvula tenĕle teve