Velugu rekhalavaaru

వెలుగు రేఖలవారు
Year
Language

పల్లవి:

వెలుగూ రేఖలవారూ తెలవారీ తామొచ్చీ ఎండా ముగ్గులు పెట్టంగా
చిలకా ముక్కులవారు చీకటితోనే వచ్చి చిగురూ తోరణం కట్టంగా
మనవలనెత్తే తాతా మనువాడా వచ్చాడూ మందార పువ్వంటి మా బామ్మని...
అమ్మమ్మ నీ

చరణం 1:

నోమీ నమ్మల్లాలో నోమన్నలాలో సందామామా.. సందామామా
నోచేవారింటిలోన పూచే పున్నాలబంతి సందామామా... సందామామా
పండంటి ముత్తైదు సందామామా
పసుపు బొట్టంట మా తాత సందామామా

నోమీ నమ్మల్లాలో నోమన్నలాలో సందామామా సందామామా
నోచేవారింటిలోన పూచే పున్నాలబంతి సందామామా సందామామా

చరణం 2:

కూచను చెరిగే చేతి కురులపై తుమ్మెదలాడే ఓలాలా
...తుమ్మెదలాడే ఓలాలా
కుందిని దంచే నాతి దరువుకే గాజులు పాడే ఓలాలా
...గాజులు పాడే ఓలాలా
గంధం పూసే మెడలో తాళిని కట్టేదెవరే ఇల్లాలా
...కట్టేదెవరే ఇల్లాలా
మెట్టినింటిలో మట్టెల పాదం తొక్కిన ఘనుడే ఏలాల
..ఏలాలో ఏలాలా ఏలాలో ఏలాలా

దివిటీల సుక్కల్లో దివినేలు మామా సందామామా సందామామా
గగనాల రధమెక్కి దిగివచ్చి దీవించు సందామామా సందామామా

నోమీ నమ్మల్లాలో నోమన్నలాలో సందామామా సందామామా
నోచేవారింటిలోన పూచే పున్నాలబంతి సందామామా సందామామా

చరణం 3:

ఆ పైన ఏముంది ఆమూల గదిలోన
ఆరు తరములనాటి ఓ పట్టెమంచం
తొలిరాత్రి మలిరాత్రి తొందళ్ళరాత్రి
ఆమంచమే పెంచె మీ తాత వంశం

అరవయ్యేళ్ళ పెళ్ళి అరుదైన పెళ్ళి
మరలిరాని పెళ్ళి మరుడింటి పెళ్ళి
ఇరవయ్యేళ్ళ వాడు మీ రాముడైతే
పదహారేళ్ళ పడుచు మా జానకమ్మ
నిండా నూరేళ్ళంట ముత్తైదు జన్మ
పసుపు కుంకుమ కలిపి చేశాడు బ్రహ్మా

ఆనందమానందమాయెనే మా తాతయ్య పెళ్ళికొడుకాయెనే
ఆనందమానందమాయెనే మా నానమ్మ పెళ్ళికూతురాయెనే

pallavi:

vĕlugū rekhalavārū tĕlavārī tāmŏchchī ĕṁḍā muggulu pĕṭṭaṁgā
silagā mukkulavāru sīgaḍidone vachchi sigurū toraṇaṁ kaṭṭaṁgā
manavalanĕtte tādā manuvāḍā vachchāḍū maṁdāra puvvaṁṭi mā bāmmani...
ammamma nī

saraṇaṁ 1:

nomī nammallālo nomannalālo saṁdāmāmā.. saṁdāmāmā
nosevāriṁṭilona pūse punnālabaṁti saṁdāmāmā... saṁdāmāmā
paṁḍaṁṭi muttaidu saṁdāmāmā
pasubu bŏṭṭaṁṭa mā tāda saṁdāmāmā

nomī nammallālo nomannalālo saṁdāmāmā saṁdāmāmā
nosevāriṁṭilona pūse punnālabaṁti saṁdāmāmā saṁdāmāmā

saraṇaṁ 2:

kūsanu sĕrige sedi kurulabai tummĕdalāḍe olālā
...tummĕdalāḍe olālā
kuṁdini daṁche nādi daruvuge gājulu pāḍe olālā
...gājulu pāḍe olālā
gaṁdhaṁ pūse mĕḍalo tāḽini kaṭṭedĕvare illālā
...kaṭṭedĕvare illālā
mĕṭṭiniṁṭilo maṭṭĕla pādaṁ tŏkkina ghanuḍe elāla
..elālo elālā elālo elālā

diviḍīla sukkallo divinelu māmā saṁdāmāmā saṁdāmāmā
gaganāla radhamĕkki digivachchi dīviṁchu saṁdāmāmā saṁdāmāmā

nomī nammallālo nomannalālo saṁdāmāmā saṁdāmāmā
nosevāriṁṭilona pūse punnālabaṁti saṁdāmāmā saṁdāmāmā

saraṇaṁ 3:

ā paina emuṁdi āmūla gadilona
āru taramulanāḍi o paṭṭĕmaṁchaṁ
tŏlirātri malirātri tŏṁdaḽḽarātri
āmaṁchame pĕṁchĕ mī tāda vaṁśhaṁ

aravayyeḽḽa pĕḽḽi arudaina pĕḽḽi
maralirāni pĕḽḽi maruḍiṁṭi pĕḽḽi
iravayyeḽḽa vāḍu mī rāmuḍaide
padahāreḽḽa paḍusu mā jānagamma
niṁḍā nūreḽḽaṁṭa muttaidu janma
pasubu kuṁkuma kalibi seśhāḍu brahmā

ānaṁdamānaṁdamāyĕne mā tādayya pĕḽḽigŏḍugāyĕne
ānaṁdamānaṁdamāyĕne mā nānamma pĕḽḽigūdurāyĕne