వీణ వేణువైన సరిగమ విన్నావా
పల్లవి:
వీణ వేణువైన సరిగమ విన్నావా
ఓ.... తీగ రాగమైన మధురిమ కన్నావా
తనువు తహతహలాడాల చెలరేగాల
చెలి ఊగాల ఉయ్యాలలీవేళలో...
వీణ వేణువైన సరిగమ విన్నావా
ఓ.... తీగ రాగమైన మధురిమ కన్నావా
చరణం 1:
ఊపిరి తగిలిన వేళా - నే వంపులు తిరిగిన వేళా
నా వీణలో నీ వేణువే పలికే రాగమాలా
ఆ...ఆ.. లాలలా... ఆ...
చూపులు రగిలిన వేళా ఆ చుక్కలు వెలిగిన వేళా
నా తనువునా అణువణువునా జరిగే రాసలీలా ..
చరణం 2:
ఎదలో అందం ఎదుటా - ఎదుటే వలచిన వనితా
నీ రాకతో నా తోటలో - వెలసే వనదేవతా
ఆ... ఆ.. లాలలా... ఆ...
కదిలే అందం కవితా - అది కౌగిలికొస్తే యువతా
నా పాటలో నీ పల్లవే - నవతా నవ్య మమతా
pallavi:
vīṇa veṇuvaina sarigama vinnāvā
o.... tīga rāgamaina madhurima kannāvā
tanuvu tahadahalāḍāla sĕlaregāla
sĕli ūgāla uyyālalīveḽalo...
vīṇa veṇuvaina sarigama vinnāvā
o.... tīga rāgamaina madhurima kannāvā
saraṇaṁ 1:
ūbiri tagilina veḽā - ne vaṁpulu tirigina veḽā
nā vīṇalo nī veṇuve palige rāgamālā
ā...ā.. lālalā... ā...
sūbulu ragilina veḽā ā sukkalu vĕligina veḽā
nā tanuvunā aṇuvaṇuvunā jarige rāsalīlā ..
saraṇaṁ 2:
ĕdalo aṁdaṁ ĕduḍā - ĕduḍe valasina vanidā
nī rāgado nā toḍalo - vĕlase vanadevadā
ā... ā.. lālalā... ā...
kadile aṁdaṁ kavidā - adi kaugiligŏste yuvadā
nā pāḍalo nī pallave - navadā navya mamadā