Vayyaari godaaramma ollamta emdugamma kala

వయ్యారి గోదారమ్మ ఒళ్ళంత ఎందుకమ్మ కల
Year
Language

పల్లవి:

వయ్యారి గోదారమ్మ
ఒళ్ళంత ఎందుకమ్మ కలవరం
కడలి ఒడిలో కలసిపోతే కల - వరం
ఇన్ని కలలిక ఎందుకో కన్నె కలయిక కోరుకో
కలవరింతే కౌగిలింతై !!వయ్యారి!!

చరణం 1:

నిజము నా స్వప్నం అహా కలనో ఓహో లేనో ఓహో హో
నీవు నా సత్యం అహా అవునో ఓహో కానో ఓహో హో
ఊహ నీవే ఆహాహాహా.. ఉసురుకారాదా.. ఆహా
మోహమల్లె ఆహాహాహా ముసురుకోరాదా.. ఆహా
నవ్వేటి నక్షత్రాలు మువ్వల్ని ముద్దాడంగ
మువ్వగోపాలుని రాధికా
ఆకాశవీణ గీతాలలోన ఆలపనై నే కరిగిపోనా !!వయ్యారి!!

చరణం 2:

తాకితే తాపం ఓహో కమలం ఓహో భ్రమరం ఓహో హో
సోకితే మైకం ఓహో అధరం ఓహో మధురం ఓహో హో
ఆటవెలది ఆహాహాహా ఆడుతూరావే
తేటగీతి ఆహాహా...హా.. తేలిపోనీవే
పున్నాగ కోవెల్లోన పూజారి దోసిళ్ళన్ని యవ్వనాలకు కానుక
చుంబించుకున్న బింభాధరాల
సూర్యోదయాలే పండేటి వేళ !!వయ్యారి!!

pallavi:

vayyāri godāramma
ŏḽḽaṁta ĕṁdugamma kalavaraṁ
kaḍali ŏḍilo kalasibode kala - varaṁ
inni kalaliga ĕṁdugo kannĕ kalayiga korugo
kalavariṁte kaugiliṁtai !!vayyāri!!

saraṇaṁ 1:

nijamu nā svapnaṁ ahā kalano oho leno oho ho
nīvu nā satyaṁ ahā avuno oho kāno oho ho
ūha nīve āhāhāhā.. usurugārādā.. āhā
mohamallĕ āhāhāhā musurugorādā.. āhā
navveḍi nakṣhatrālu muvvalni muddāḍaṁga
muvvagobāluni rādhigā
āgāśhavīṇa gīdālalona ālabanai ne karigibonā !!vayyāri!!

saraṇaṁ 2:

tāgide tābaṁ oho kamalaṁ oho bhramaraṁ oho ho
sogide maigaṁ oho adharaṁ oho madhuraṁ oho ho
āḍavĕladi āhāhāhā āḍudūrāve
teḍagīdi āhāhā...hā.. telibonīve
punnāga kovĕllona pūjāri dosiḽḽanni yavvanālagu kānuga
suṁbiṁchugunna biṁbhādharāla
sūryodayāle paṁḍeḍi veḽa !!vayyāri!!