పల్లవి:
వస్తాడు నారాజు ఈరోజు
రానే వస్తాడు నెలరాజు ఈ రోజు
కార్తీకపున్నమి వేళలోన
కలికి వెన్నెల కెరటాలపైన
కార్తీకపున్నమి వేళలోన
కలికి వెన్నెల కెరటాలపైన
తేలివస్తాడు నారాజు ఈరోజు
చరణం 1:
వేలతారకల నయనాలతో నీలాకాశం తిలకించేను||2||
అతని చల్లని అడుగుల సవ్వడి వీచేగాలి వినిపించేను
ఆతని పావన పాదధూళికై అవని అణువణువు కలవరించేను
అతని రాకకై అంతరంగమే పాలసంద్రమై పరవశించేను
చరణం 2:
వెన్నెలలెంతగా విరిసినగానీ చంద్రుణ్ణీ విడిపోలేవు
కెరటాలెంతగా పొంగినగానీ కడలిని విడిపోలేవు
కలసిన ఆత్మల అనుబంధాలు ఏజన్మకు విడిపోలేవులే
తనువులు వేరైనా దారులు వేరైనా
తనువులు వేరైనా దారులు వేరైనా
ఆ బంధాలే నిలిచేనులే..
pallavi:
vastāḍu nārāju īroju
rāne vastāḍu nĕlarāju ī roju
kārdīgabunnami veḽalona
kaligi vĕnnĕla kĕraḍālabaina
kārdīgabunnami veḽalona
kaligi vĕnnĕla kĕraḍālabaina
telivastāḍu nārāju īroju
saraṇaṁ 1:
veladāragala nayanālado nīlāgāśhaṁ tilagiṁchenu||2||
adani sallani aḍugula savvaḍi vīsegāli vinibiṁchenu
ādani pāvana pādadhūḽigai avani aṇuvaṇuvu kalavariṁchenu
adani rāgagai aṁtaraṁgame pālasaṁdramai paravaśhiṁchenu
saraṇaṁ 2:
vĕnnĕlalĕṁtagā virisinagānī saṁdruṇṇī viḍibolevu
kĕraḍālĕṁtagā pŏṁginagānī kaḍalini viḍibolevu
kalasina ātmala anubaṁdhālu ejanmagu viḍibolevule
tanuvulu verainā dārulu verainā
tanuvulu verainā dārulu verainā
ā baṁdhāle nilisenule..