పల్లవి:
వస్తాడమ్మా నీ దైవమూ.. వస్తుందమ్మా వసంతమూ (2)
కలలే నిజమై వలపే వరమై
కళ కళ లాడును జీవితము
వస్తాడమ్మా నీ దైవమూ వస్తుందమ్మా వసంతమూ
చరణం 1:
పేరే కాదు ప్రేమకు కూడా శ్రీకృష్ణుడమ్మా నీ ప్రియుడు (2)
తన ముద్దుల మురళిగ నిను మార్చి(2)
మోహనరాగం ఆలపించును
వస్తాడమ్మా నీ దైవమూ వస్తుందమ్మా వసంతమూ
చరణం 2:
పసిపాపవలే నిను ఒడి చేర్చి కనుపాపవలే కాపాడును (2)
నీ మనసే మందిరముగ చేసీ.. ఈ ...
నీ మనసే మందిరముగ చేసి దైవం తానై వరములిచ్చును
వస్తాడమ్మా నీ దైవమూ వస్తుందమ్మా వసంతమూ
చరణం 3:
ఎక్కడివాడో ఇక్కడి వాడై దక్కినాడు నీ తపసు ఫలించి (2)
నాడొక చెట్టును మోడు చేసినా ఆ వాడే మోడుకు చిగురు పూర్చును
వస్తాడమ్మా నీ దైవమూ వస్తుందమ్మా వసంతమూ
pallavi:
vastāḍammā nī daivamū.. vastuṁdammā vasaṁtamū (2)
kalale nijamai valabe varamai
kaḽa kaḽa lāḍunu jīvidamu
vastāḍammā nī daivamū vastuṁdammā vasaṁtamū
saraṇaṁ 1:
pere kādu premagu kūḍā śhrīkṛṣhṇuḍammā nī priyuḍu (2)
tana muddula muraḽiga ninu mārsi(2)
mohanarāgaṁ ālabiṁchunu
vastāḍammā nī daivamū vastuṁdammā vasaṁtamū
saraṇaṁ 2:
pasibābavale ninu ŏḍi sersi kanubābavale kābāḍunu (2)
nī manase maṁdiramuga sesī.. ī ...
nī manase maṁdiramuga sesi daivaṁ tānai varamulichchunu
vastāḍammā nī daivamū vastuṁdammā vasaṁtamū
saraṇaṁ 3:
ĕkkaḍivāḍo ikkaḍi vāḍai dakkināḍu nī tabasu phaliṁchi (2)
nāḍŏga sĕṭṭunu moḍu sesinā ā vāḍe moḍugu siguru pūrsunu
vastāḍammā nī daivamū vastuṁdammā vasaṁtamū