Title (Indic)మెల్లగా కరగనీ రెండు మనసుల దూరం WorkVarsham Year2004 LanguageTelugu Credits Role Artist Music Devi Sri Prasad Performer Sumamgali Performer Es.pi. saran Writer Sirivennela Seetharama Sastry LyricsTeluguపల్లవి: మెల్లగా కరగనీ రెండు మనసుల దూరం చల్లగా తెరవని కొంటె తలపుల ద్వారం వలపు వాన దారాలే పంపుతున్నది ఆకాశం చినుకు పూల హారాలే అల్లుతున్నది మన కోసం తడిపే తడికి తనతో నడిపి హరివిల్లును వంతెన వేసిన శుభవేళా ఈ వర్షం సాక్షిగా తెలపనీ నువు నాకె సొంతం ఈ వర్షం సాక్షిగా కలపనీ బంధం మెల్లగా కరగనీ రెండు మనసుల దూరం చల్లగా తెరవని కొంటె తలపుల ద్వారం చరణం 1: నీ మెలికలలోన ఆ మెరుపులు చూస్తున్నా ఈ తొలకరిలో తల తల నాట్యం నీదేనా ఆ ఉరుములలోన నీ పిలుపులు వింటున్నా ఈ చిటపటలో చిటికెల తాళం నీదేనా మతి చెడే దాహమై అనుసరించి వస్తున్నా జత పడే స్నేహమై అనునయించనా చలి పిడుగుల సడి విని జడిసిన బిడియం తడబడి నిన్ను విడదా చరణం 2: ఏ తెరమరుగైన ఈ చొరవను ఆపేనా నా పరువము నీ కనులకు కానుక ఇస్తున్నా ఏ చిరు చినుకైన నీ సిరులను చూపేనా ఆ వరుణికె ఋణపడిపోనా ఈ పైన త్వరపడే వయసునే నిలుపలేను ఇకపైన విడుదలే వద్దనే ముడులువేయనా మన కలయిక చెదరని చెలిమి ఋజువని చరితలు చదివేలా Englishpallavi: mĕllagā karaganī rĕṁḍu manasula dūraṁ sallagā tĕravani kŏṁṭĕ talabula dvāraṁ valabu vāna dārāle paṁpudunnadi āgāśhaṁ sinugu pūla hārāle alludunnadi mana kosaṁ taḍibe taḍigi tanado naḍibi harivillunu vaṁtĕna vesina śhubhaveḽā ī varṣhaṁ sākṣhigā tĕlabanī nuvu nāgĕ sŏṁtaṁ ī varṣhaṁ sākṣhigā kalabanī baṁdhaṁ mĕllagā karaganī rĕṁḍu manasula dūraṁ sallagā tĕravani kŏṁṭĕ talabula dvāraṁ saraṇaṁ 1: nī mĕligalalona ā mĕrubulu sūstunnā ī tŏlagarilo tala tala nāṭyaṁ nīdenā ā urumulalona nī pilubulu viṁṭunnā ī siḍabaḍalo siḍigĕla tāḽaṁ nīdenā madi sĕḍe dāhamai anusariṁchi vastunnā jada paḍe snehamai anunayiṁchanā sali piḍugula saḍi vini jaḍisina biḍiyaṁ taḍabaḍi ninnu viḍadā saraṇaṁ 2: e tĕramarugaina ī sŏravanu ābenā nā paruvamu nī kanulagu kānuga istunnā e siru sinugaina nī sirulanu sūbenā ā varuṇigĕ ṛṇabaḍibonā ī paina tvarabaḍe vayasune nilubalenu igabaina viḍudale vaddane muḍuluveyanā mana kalayiga sĕdarani sĕlimi ṛjuvani saridalu sadivelā