పల్లవి:
వారెవా.. మానవా.. ఎదలే అదిరే
జోరుగా.. జోడుగా... కథలే ముదిరే
ఓపలేను.. తపనలు ఆపలేను ..
మదనుడ... రావేరా జత నీవేరా...
రావేరా జత నీవేరా...
వారెవా ...పాడవే ..నిదురే చెదిరే
వాటమై.. జంటగా ...వలపే కుదిరే
చరణం 1:
మొత్తుకున్న మోహాలకు మోజే బలిసే...
చెలి గొంతు దాటు దాహాలకు తీపే తెలిసే..
చీరమాటు శ్రీలేఖలు లగ్గాలడిగే..
కడ కొంగుచాటు కోణాలకు ప్రాణాలెగిరే...
వనితల తలపులే... కవితల మెరుపులూ
పురుషుల వలపులే ...చరితకు మలుపులూ
ఇంతగా కోరితే.. చెంత చేరనా
చెంతకే చేరితే ...చేతులాగునా
ఒక ఉడుకై... ఒడిదుడుకై ...చలి చెరుగులెగసెరా
వారెవా పాడవే నిదురే చెదిరే
వాటమై జంటగా వలపే కుదిరే
ఆగలేను తపనలు తాగలేను
మదనిక రావేలా జత నీవేగా
వారెవా మానవా ఎదలే అదిరే
జోరుగా జోడుగా కథలే ముదిరే
చరణం 2:
కన్ను కన్ను కావ్యాలకు ప్రాసే కుదిరే
అది నిన్ను నన్ను కౌగిళ్ళకు ముందే తలిచే
గిచ్చు గిచ్చు గీతాలకు రాగాలదిరే
అవి చిచ్చు పెట్టి శ్రీమన్మధలీలే ముదిరే
పెదవుల గుసగుసే...ప్రేమకు పదనిస
తనువుల కలయికే ...మనువుకు కళ ఇక
ఆశగా కోరితే అందమివ్వనా...
అందమో... చందమో ..అంతు చూడనా
అది ఉలుకో.. చెలి పలుకో ..తొలి వలపు చిలికెనె..
వారెవా మానవా ఎదలే అదిరే
జోరుగా జోడుగా కధలే ముదిరే
ఆగలేను తపనలు తాగలేను
మదనిక రావేలా జత నీవేగా
... రావేలా జత నీవేగా
వారెవా మానవా ఎదలే అదిరే
వాటమై జంటగా వలపే కుదిరే
pallavi:
vārĕvā.. mānavā.. ĕdale adire
jorugā.. joḍugā... kathale mudire
obalenu.. tabanalu ābalenu ..
madanuḍa... rāverā jada nīverā...
rāverā jada nīverā...
vārĕvā ...pāḍave ..nidure sĕdire
vāḍamai.. jaṁṭagā ...valabe kudire
saraṇaṁ 1:
mŏttugunna mohālagu moje balise...
sĕli gŏṁtu dāḍu dāhālagu tībe tĕlise..
sīramāḍu śhrīlekhalu laggālaḍige..
kaḍa kŏṁgusāḍu koṇālagu prāṇālĕgire...
vanidala talabule... kavidala mĕrubulū
puruṣhula valabule ...saridagu malubulū
iṁtagā koride.. sĕṁta seranā
sĕṁtage seride ...sedulāgunā
ŏga uḍugai... ŏḍiduḍugai ...sali sĕrugulĕgasĕrā
vārĕvā pāḍave nidure sĕdire
vāḍamai jaṁṭagā valabe kudire
āgalenu tabanalu tāgalenu
madaniga rāvelā jada nīvegā
vārĕvā mānavā ĕdale adire
jorugā joḍugā kathale mudire
saraṇaṁ 2:
kannu kannu kāvyālagu prāse kudire
adi ninnu nannu kaugiḽḽagu muṁde talise
gichchu gichchu gīdālagu rāgāladire
avi sichchu pĕṭṭi śhrīmanmadhalīle mudire
pĕdavula gusaguse...premagu padanisa
tanuvula kalayige ...manuvugu kaḽa iga
āśhagā koride aṁdamivvanā...
aṁdamo... saṁdamo ..aṁtu sūḍanā
adi ulugo.. sĕli palugo ..tŏli valabu siligĕnĕ..
vārĕvā mānavā ĕdale adire
jorugā joḍugā kadhale mudire
āgalenu tabanalu tāgalenu
madaniga rāvelā jada nīvegā
... rāvelā jada nīvegā
vārĕvā mānavā ĕdale adire
vāḍamai jaṁṭagā valabe kudire