Vaanajallu gilludumte ettaagammaa

వానజల్లు గిల్లుతుంటె ఎట్టాగమ్మా
Year
Language

పల్లవి:

వానజల్లు గిల్లుతుంటె ఎట్టాగమ్మా
నీటిముళ్ళే గుచ్చుకుంటె ఎట్టాగమ్మా
సన్నతొడిమంటి నడుముందిలే ..లయలే చూసి లాలించుకో

వానజల్లు గిల్లుడింక తప్పదమ్మా
ఒంటిమొగ్గ విచ్చుకోక తప్పదమ్మా
చితచితలాడు ఈ చిందులో .. జతులాడాలి జతచేరుకో ..ఓ..

చరణం 1:

వానవిల్లు చీరచాటు వన్నెలేరుకో ..వద్దు లేదు నా బాషలో
మబ్బుచాటు చందమామ సారెపెట్టుకో ..హద్దు లేదు ఈ హాయిలో
కోడె ఊపిరి తాకితే - ఈడు ఆవిరే ఆరదా
కోక గాలులే హోయ్ సోకితే - కోరికన్నదే రేగదా?!
వడగట్టేసి బిడియాలనే .. ఒడి చేరాను వాటేసుకో!!

చరణం 2:

అందమంత ఝల్లుమంటే అడ్డుతాకునా .. చీరకట్టు తానాగునా
పాలుపుంత ఎల్లువైతే పొంగుదాగునా .. జారుపైట తానాగునా
క్రొత్తకోణమే ఎక్కడో పూలబాణమై తాకగా
చల్లగాలిలో సన్నగా కూని రాగమే సాగగా
తొడగొట్టేసి జడివానకే ..గొడుగేసాను తలదాచుకో!!

pallavi:

vānajallu gilluduṁṭĕ ĕṭṭāgammā
nīḍimuḽḽe guchchuguṁṭĕ ĕṭṭāgammā
sannadŏḍimaṁṭi naḍumuṁdile ..layale sūsi lāliṁchugo

vānajallu gilluḍiṁka tappadammā
ŏṁṭimŏgga vichchugoga tappadammā
sidasidalāḍu ī siṁdulo .. jadulāḍāli jadaserugo ..o..

saraṇaṁ 1:

vānavillu sīrasāḍu vannĕlerugo ..vaddu ledu nā bāṣhalo
mabbusāḍu saṁdamāma sārĕbĕṭṭugo ..haddu ledu ī hāyilo
koḍĕ ūbiri tāgide - īḍu āvire āradā
koga gālule hoy sogide - korigannade regadā?!
vaḍagaṭṭesi biḍiyālane .. ŏḍi serānu vāḍesugo!!

saraṇaṁ 2:

aṁdamaṁta jhallumaṁṭe aḍḍudāgunā .. sīragaṭṭu tānāgunā
pālubuṁta ĕlluvaide pŏṁgudāgunā .. jārubaiḍa tānāgunā
krŏttagoṇame ĕkkaḍo pūlabāṇamai tāgagā
sallagālilo sannagā kūni rāgame sāgagā
tŏḍagŏṭṭesi jaḍivānage ..gŏḍugesānu taladāsugo!!