Eduda nilisimdi soodu...

ఎదుట నిలిచింది చూడు...
Work
Year
Language

పల్లవి:

ఎదుట నిలిచింది చూడు .. జలతారు వెన్నెలేమో
ఎదను తడిపింది నేడు .. చిరుకంటి చిన్నదేమో
మైమరిచిపోయా మాయలో... ప్రాణమంతా మీటుతుంటే వానవీణలా

చరణం 1:

నిజంలాంటి ఈ స్వప్నం .. ఎలా పట్టి ఆపాలి?
కలే ఐతే ఆ నిజం .. ఎలా తట్టుకోవాలీ?
అవునో .. కాదో .. అడగకంది నా మౌనం
చెలివో శిలవో తెలియకుంది నీ రూపం .. చెలిమి బంధం అల్లుకుందే .. జన్మ ఖైదులా !!

చరణం 2:

నిన్నే చేరుకోలేకా .. ఎటెళ్ళిందో నా లేఖ
వినేవారు లేకా .. విసుక్కుంది నా కేకా
నీదో .. కాదో .. వ్రాసున్న చిరునామా
ఉందో .. లేదో .. ఆ చోట నా ప్రేమా .. వరం లాంటి శాపమేదో సొంతమైందిలా !!!

pallavi:

ĕduḍa nilisiṁdi sūḍu .. jaladāru vĕnnĕlemo
ĕdanu taḍibiṁdi neḍu .. sirugaṁṭi sinnademo
maimarisiboyā māyalo... prāṇamaṁtā mīḍuduṁṭe vānavīṇalā

saraṇaṁ 1:

nijaṁlāṁṭi ī svapnaṁ .. ĕlā paṭṭi ābāli?
kale aide ā nijaṁ .. ĕlā taṭṭugovālī?
avuno .. kādo .. aḍagagaṁdi nā maunaṁ
sĕlivo śhilavo tĕliyaguṁdi nī rūbaṁ .. sĕlimi baṁdhaṁ alluguṁde .. janma khaidulā !!

saraṇaṁ 2:

ninne serugolegā .. ĕḍĕḽḽiṁdo nā lekha
vinevāru legā .. visukkuṁdi nā kegā
nīdo .. kādo .. vrāsunna sirunāmā
uṁdo .. ledo .. ā soḍa nā premā .. varaṁ lāṁṭi śhābamedo sŏṁtamaiṁdilā !!!