ఆకాశ గంగా… దూకావే పెంకితనంగా
పల్లవి:
ఆకాశ గంగా… దూకావే పెంకితనంగా… ఆకాశ గంగా
జల జల జడిగా.. తొలి అలజడిగా
తడబడు అడుగా.. నిలబడు సరిగా
నా తలకు ముడివేస్తున్నా నిన్నాపగా
చరణం 1:
కనుబొమ్మ విల్లెత్తి.. ఓ నవ్వు విసిరావే
చిలకమ్మ గొంతెత్తి.. తీయంగ కసిరావే
చిటపటలాడి.. వెలసిన వాన
మెరుపుల గాలి.. కనుమరుగైనా
నా గుండెలయలో విన్నా నీ అలికిడి !
చరణం 2:
ఈ పూట వినకున్నా.. నా పాట ఆగేనా
ఏ బాటలోనైనా.. నీ పైటనొదిలేనా
మనసుని నీతో.. పంపిస్తున్నా
నీ ప్రతి మలుపు ..తెలుపవె అన్నా
ఆ జాడలన్ని వెతికి.. నిన్ను చేరనా !!
pallavi:
āgāśha gaṁgā… dūgāve pĕṁkidanaṁgā… āgāśha gaṁgā
jala jala jaḍigā.. tŏli alajaḍigā
taḍabaḍu aḍugā.. nilabaḍu sarigā
nā talagu muḍivestunnā ninnābagā
saraṇaṁ 1:
kanubŏmma villĕtti.. o navvu visirāve
silagamma gŏṁtĕtti.. tīyaṁga kasirāve
siḍabaḍalāḍi.. vĕlasina vāna
mĕrubula gāli.. kanumarugainā
nā guṁḍĕlayalo vinnā nī aligiḍi !
saraṇaṁ 2:
ī pūḍa vinagunnā.. nā pāḍa āgenā
e bāḍalonainā.. nī paiḍanŏdilenā
manasuni nīdo.. paṁpistunnā
nī pradi malubu ..tĕlubavĕ annā
ā jāḍalanni vĕdigi.. ninnu seranā !!