Toorubu simdhoorabu mamdaarabu vannelalo

తూరుపు సింధూరపు మందారపు వన్నెలలో
Year
Language

పల్లవి:

తూరుపు సింధూరపు మందారపు వన్నెలలో
ఉదయరాగం.. హృదయగానం...ఉదయరాగం.. హృదయగానం
తూరుపు సింధూరపు మందారపు వన్నెలలో
ఉదయరాగం.. హృదయగానం...ఉదయరాగం.. హృదయగానం
మరళ మరళ ప్రతియేడు మధుర మధురగీతం...జన్మదిన వినోదం
మరళ మరళ ప్రతియేడు మధుర మధుర గీతం..జన్మదిన వినోదం

తూరుపు సింధూరపు మందారపు వన్నెలలో
ఉదయరాగం.. హృదయగానం...ఉదయరాగం.. హృదయగానం...

చరణం 1:

వేల వేల వత్సరాలకేళిలో...మానవుడుదయించిన శుభవేళలో..ఓ..
వేల వేల వత్సరాలకేళిలో...మానవుడుదయించిన శుభవేళలో..ఓ..
వీచే మలయమారుతాలు ...పుడమి పలికి స్వాగతాలు
మాలికలై తారకలే...మలికికాంతి తోరణాలు..ఓ..ఓ...హోయ్

తూరుపు సింధూరపు మందారపు వన్నెలలో
ఉదయరాగం.. హృదయగానం...ఉదయరాగం.. హృదయగానం...

చరణం 2:

వలపులోన పులకరించు కన్నులతో ...చెలిమి చేరి పలకరించు మగవారు
మనసులోన పరిమళించు వెన్నెలతో...ప్రియుని చూచి పరవశించే ప్రియురాలు
జీవితమే స్నేహమయం ..ఈ జగమే ప్రేమమయం..ప్రేమంటే ఒక భోగం
కాదు కాదు అది త్యాగం ..ఓ..ఓ...హోయ్..

తూరుపు సింధూరపు మందారపు వన్నెలలో
ఉదయరాగం.. హృదయగానం...ఉదయరాగం.. హృదయగానం...

pallavi:

tūrubu siṁdhūrabu maṁdārabu vannĕlalo
udayarāgaṁ.. hṛdayagānaṁ...udayarāgaṁ.. hṛdayagānaṁ
tūrubu siṁdhūrabu maṁdārabu vannĕlalo
udayarāgaṁ.. hṛdayagānaṁ...udayarāgaṁ.. hṛdayagānaṁ
maraḽa maraḽa pradiyeḍu madhura madhuragīdaṁ...janmadina vinodaṁ
maraḽa maraḽa pradiyeḍu madhura madhura gīdaṁ..janmadina vinodaṁ

tūrubu siṁdhūrabu maṁdārabu vannĕlalo
udayarāgaṁ.. hṛdayagānaṁ...udayarāgaṁ.. hṛdayagānaṁ...

saraṇaṁ 1:

vela vela vatsarālageḽilo...mānavuḍudayiṁchina śhubhaveḽalo..o..
vela vela vatsarālageḽilo...mānavuḍudayiṁchina śhubhaveḽalo..o..
vīse malayamārudālu ...puḍami paligi svāgadālu
māligalai tāragale...maligigāṁti toraṇālu..o..o...hoy

tūrubu siṁdhūrabu maṁdārabu vannĕlalo
udayarāgaṁ.. hṛdayagānaṁ...udayarāgaṁ.. hṛdayagānaṁ...

saraṇaṁ 2:

valabulona pulagariṁchu kannulado ...sĕlimi seri palagariṁchu magavāru
manasulona parimaḽiṁchu vĕnnĕlado...priyuni sūsi paravaśhiṁche priyurālu
jīvidame snehamayaṁ ..ī jagame premamayaṁ..premaṁṭe ŏga bhogaṁ
kādu kādu adi tyāgaṁ ..o..o...hoy..

tūrubu siṁdhūrabu maṁdārabu vannĕlalo
udayarāgaṁ.. hṛdayagānaṁ...udayarāgaṁ.. hṛdayagānaṁ...