Tomgi tomgi soodamaagu samdamaamaa

తొంగి తొంగి చూడమాకు చందమామా
Year
Language

పల్లవి:

తొంగి తొంగి చూడమాకు చందమామా
నీ సంగతంత తెలుసు మాకు చందమామా
దోరదోర వయసులో చందమామా
ఆ తారనేం చేశావు చందమామా
వావి వరస చూశావా చందమామా
నీ వయసునాపుకున్నావా చందమామా
అంతమచ్చ పెట్టుకుని చందమామా
నీకెందుకింత మత్సరం చందమామా

చరణం 1:

వెన్నెల్లో వేడుకుంది కన్నుల్లో కోరికుంది ముద్దుగుమ్మా
ఇద్దర్లో వేగముంది వద్దన్నా ఆగకుంది పైడిబొమ్మా
పూల బాణాలు వేసుకుందమా .. ప్రేమ గాయాలు చేసుకుందమా
పూల బాణాలు వేసుకుందమా .. ప్రేమ గాయాలు చేసుకుందమా
కలిసే ఉందామా .. కరిగే పోదామా
హేయ్ చుప్పనాతి చుక్కల్ని దాటుదామా .. అరె చూడలేని చంద్రుణ్ణి తరుముదామా

చరణం 2:

గుండెల్లో తాళముంది గొంతుల్లో రాగముంది కలుపుదామా
పొద్దెంతో హాయిగుంది ఎంతెంతో పొద్దువుంది గడుపుదామా
ముద్దు మురిపెంలో మునిగిపోదమా తీపిగా వానలో తేలిపోదమా
ముద్దు మురిపెంలో మునిగిపోదమా తీపిగా వానలో తేలిపోదమా

స్వర్గం చూద్దామా .. సొంతం చేద్దామా
హా మత్సరాలు మాననీ మచ్చమామా .. దండమెట్టి ఇద్దరం కొలుచుకోమా

pallavi:

tŏṁgi tŏṁgi sūḍamāgu saṁdamāmā
nī saṁgadaṁta tĕlusu māgu saṁdamāmā
doradora vayasulo saṁdamāmā
ā tāraneṁ seśhāvu saṁdamāmā
vāvi varasa sūśhāvā saṁdamāmā
nī vayasunābugunnāvā saṁdamāmā
aṁtamachcha pĕṭṭuguni saṁdamāmā
nīgĕṁdugiṁta matsaraṁ saṁdamāmā

saraṇaṁ 1:

vĕnnĕllo veḍuguṁdi kannullo koriguṁdi muddugummā
iddarlo vegamuṁdi vaddannā āgaguṁdi paiḍibŏmmā
pūla bāṇālu vesuguṁdamā .. prema gāyālu sesuguṁdamā
pūla bāṇālu vesuguṁdamā .. prema gāyālu sesuguṁdamā
kalise uṁdāmā .. karige podāmā
hey suppanādi sukkalni dāḍudāmā .. arĕ sūḍaleni saṁdruṇṇi tarumudāmā

saraṇaṁ 2:

guṁḍĕllo tāḽamuṁdi gŏṁtullo rāgamuṁdi kalubudāmā
pŏddĕṁto hāyiguṁdi ĕṁtĕṁto pŏdduvuṁdi gaḍubudāmā
muddu muribĕṁlo munigibodamā tībigā vānalo telibodamā
muddu muribĕṁlo munigibodamā tībigā vānalo telibodamā

svargaṁ sūddāmā .. sŏṁtaṁ seddāmā
hā matsarālu mānanī machchamāmā .. daṁḍamĕṭṭi iddaraṁ kŏlusugomā