తొలికోడి కూసేను తెలవార వచ్చేను
పల్లవి:
తొలికోడి కూసేను తెలవార వచ్చేను
మరుకేళి చాలించి నిదురపో
తొలికోడి కూసేను తెలవార వచ్చేను
మరుకేళి చాలించి నిదురపో
నాదు మొరకాస్త ఆలించి నిదురపో
అందగాడా నిదురపో చందురూడా నిదురపో
అందగాడా నిదురపో చందురూడా నిదురపో
తొలికోడి కూసేను తెలవార వచ్చేను
మరుకేళి చాలించి నిదురపో
చరణం 1:
ఇల్లంతా కడగాలి కళ్లాపి చల్లాలి
ముగ్గులు పెట్టాలి గోపాలుడా
కాఫీలు కలపాలి టిఫినీలు చెయ్యాలి
చెంగు విడిచిపెట్టు గోపాలుడా
చెంగు విడిచిపెట్టి సెలవిచ్చి పంపితే
మాపటేళకు మళ్లీ వస్తాను
తెల్లచీర కట్టి మల్లెపూలు పెట్టి
గుమ్ము గుమ్మను కౌగిలిస్తాను
గుండెలో వలపంతా గుమ్మరిస్తాను
చెంగు వదలర సామి గోపాలుడా
సరుసుడ నా సామి గోపాలుడా
తొలికోడి కూసేను తెలవార వచ్చేను
మరుకేళి చాలించి నిదురపో
తొలికోడి కూసేను తెలవార వచ్చేను
మరుకేళి చాలించి నిదురపో
చరణం 2:
సుప్పనాతి సూరీడొచ్చెను
వెన్నెలంతా ఎర్రాబారెను
మల్లెలన్నీ నల్లాబోయెను కలువకన్నియ
కందీపోయెను కమిలిపోయెను కానుకో
కంటినిండా నిదురకోసం
కాచి ఉన్నది చూసుకో రసికరాజ నిదురపో
ధిక్తన ధిక్తన ధిక్తన ధిన ధిక్తన ధిక్తన ధిక్తన
మూడు జాములు తిరగాలేదు
నాలుగోది పొడవాలేదు
తొందరెందుకు సూరీడా ఎందుకొస్తివి సూరీడా
నిన్నెవరు పిలిచారు సూరీడా
నీకిక్కడేమి పని సూరీడా
నీకెప్పుడేమి పని సూరీడా...
పోరా పోరా సూరీడా రారా రారా సూరీడా
పోరా పోరా...
pallavi:
tŏligoḍi kūsenu tĕlavāra vachchenu
marugeḽi sāliṁchi nidurabo
tŏligoḍi kūsenu tĕlavāra vachchenu
marugeḽi sāliṁchi nidurabo
nādu mŏragāsta āliṁchi nidurabo
aṁdagāḍā nidurabo saṁdurūḍā nidurabo
aṁdagāḍā nidurabo saṁdurūḍā nidurabo
tŏligoḍi kūsenu tĕlavāra vachchenu
marugeḽi sāliṁchi nidurabo
saraṇaṁ 1:
illaṁtā kaḍagāli kaḽlābi sallāli
muggulu pĕṭṭāli gobāluḍā
kāphīlu kalabāli ṭiphinīlu sĕyyāli
sĕṁgu viḍisibĕṭṭu gobāluḍā
sĕṁgu viḍisibĕṭṭi sĕlavichchi paṁpide
mābaḍeḽagu maḽlī vastānu
tĕllasīra kaṭṭi mallĕbūlu pĕṭṭi
gummu gummanu kaugilistānu
guṁḍĕlo valabaṁtā gummaristānu
sĕṁgu vadalara sāmi gobāluḍā
sarusuḍa nā sāmi gobāluḍā
tŏligoḍi kūsenu tĕlavāra vachchenu
marugeḽi sāliṁchi nidurabo
tŏligoḍi kūsenu tĕlavāra vachchenu
marugeḽi sāliṁchi nidurabo
saraṇaṁ 2:
suppanādi sūrīḍŏchchĕnu
vĕnnĕlaṁtā ĕrrābārĕnu
mallĕlannī nallāboyĕnu kaluvaganniya
kaṁdīboyĕnu kamiliboyĕnu kānugo
kaṁṭiniṁḍā niduragosaṁ
kāsi unnadi sūsugo rasigarāja nidurabo
dhiktana dhiktana dhiktana dhina dhiktana dhiktana dhiktana
mūḍu jāmulu tiragāledu
nālugodi pŏḍavāledu
tŏṁdarĕṁdugu sūrīḍā ĕṁdugŏstivi sūrīḍā
ninnĕvaru pilisāru sūrīḍā
nīgikkaḍemi pani sūrīḍā
nīgĕppuḍemi pani sūrīḍā...
porā porā sūrīḍā rārā rārā sūrīḍā
porā porā...