Toli valabe pade pade

తొలి వలపే పదే పదే
Work
Year
Language

పల్లవి:

తొలి వలపే.. పదే పదే పిలిచే... యెదలో సందడి చేసే..
తొలి వలపే.. పదే పదే పిలిచే... మదిలో మల్లెలు విరిసే..

తొలివలపే... ఏ.. ఏ...
ఆ...ఆ.. ఆ.. ఆ... ఆ...

చరణం 1:

ఏమో.. ఇది ఏమో..
నీ పెదవుల విరిసే నవ్వుల పువ్వుల అందాలు
ఆ అందం.. అనుబంధం..
నా మనసున మీకై దాచిన.. పూచిన కానుకలు

ఏమో.. ఇది ఏమో..
నీ పెదవుల విరిసే నవ్వుల పువ్వుల అందాలు
ఆ అందం.. అనుబంధం..
నా మనసున మీకై దాచిన.. పూచిన కానుకలు

నీ కన్నుల వెలిగెనే దీపాలు... అవి మీ ప్రేమకు ప్రతిరూపాలు
నీ కన్నుల వెలిగెనే దీపాలు... అవి మీ ప్రేమకు ప్రతిరూపాలు
మన అనురాగానికి హారతులు...

తొలి వలపే పదే పదే పిలిచే... యెదలో సందడి చేసే...
తొలి వలపే... ఏ...

గరినిరిగ... ఆ..ఆ.ఆ..
మగరిగమ.. ఆ ..ఆ.. ఆ..
గమనిదనీదప... ఆ... ఆ... ఆ...

చరణం 2:

ఏలా.. ఈ వేళా.. కడు వింతగ దోచే..
తీయగ.. హాయిగ.. ఈ జగము..

యవ్వనము.. అనుభవమూ.. జత కూడిన వేళా
కలిగిన వలపుల పరవశము

ఏలా.. ఈ వేళా.. కడు వింతగ దోచే..
తీయగ.. హాయిగ.. ఈ జగము..

యవ్వనము.. అనుభవమూ.. జత కూడిన వేళా
కలిగిన వలపుల పరవశము

ఈ రేయి పలికెలే.. స్వాగతమూ
ఈనాడే బ్రతుకున.. శుభదినమూ
ఈ రేయి పలికెలే.. స్వాగతమూ
ఈనాడే బ్రతుకున.. శుభదినమూ
ఈ తనువే మనకిక చెరిసగము

తొలి వలపే పదే పదే పిలిచే... యెదలో సందడి చేసే...
తొలి వలపే పదే పదే పిలిచే... మదిలో మల్లెలు విరిసే...

తొలివలపే... ఏ.. ఏ...

pallavi:

tŏli valabe.. pade pade pilise... yĕdalo saṁdaḍi sese..
tŏli valabe.. pade pade pilise... madilo mallĕlu virise..

tŏlivalabe... e.. e...
ā...ā.. ā.. ā... ā...

saraṇaṁ 1:

emo.. idi emo..
nī pĕdavula virise navvula puvvula aṁdālu
ā aṁdaṁ.. anubaṁdhaṁ..
nā manasuna mīgai dāsina.. pūsina kānugalu

emo.. idi emo..
nī pĕdavula virise navvula puvvula aṁdālu
ā aṁdaṁ.. anubaṁdhaṁ..
nā manasuna mīgai dāsina.. pūsina kānugalu

nī kannula vĕligĕne dībālu... avi mī premagu pradirūbālu
nī kannula vĕligĕne dībālu... avi mī premagu pradirūbālu
mana anurāgānigi hāradulu...

tŏli valabe pade pade pilise... yĕdalo saṁdaḍi sese...
tŏli valabe... e...

gariniriga... ā..ā.ā..
magarigama.. ā ..ā.. ā..
gamanidanīdaba... ā... ā... ā...

saraṇaṁ 2:

elā.. ī veḽā.. kaḍu viṁtaga dose..
tīyaga.. hāyiga.. ī jagamu..

yavvanamu.. anubhavamū.. jada kūḍina veḽā
kaligina valabula paravaśhamu

elā.. ī veḽā.. kaḍu viṁtaga dose..
tīyaga.. hāyiga.. ī jagamu..

yavvanamu.. anubhavamū.. jada kūḍina veḽā
kaligina valabula paravaśhamu

ī reyi paligĕle.. svāgadamū
īnāḍe braduguna.. śhubhadinamū
ī reyi paligĕle.. svāgadamū
īnāḍe braduguna.. śhubhadinamū
ī tanuve managiga sĕrisagamu

tŏli valabe pade pade pilise... yĕdalo saṁdaḍi sese...
tŏli valabe pade pade pilise... madilo mallĕlu virise...

tŏlivalabe... e.. e...