పల్లవి:
తొలి చూపు దూసిందీ.. హృదయాన్ని
మరు చూపు వేసిందీ... బంధాన్ని
ప్రతి చూపు చెరిపింది దూరాన్ని
పెళ్ళిచూపులే కలపాలి ఇద్దరిని
తొలి చూపు దూసిందీ.. హృదయాన్ని
మరు చూపు వేసిందీ... బంధాన్ని
చరణం 1:
ఒక చూపు తూపులా గాయాన్ని చేసింది
వేరొక చూపు వెన్నెలమావులా మెరిసింది
ఒక చూపు తూపులా గాయాన్ని చేసింది
వేరొక చూపు వెన్నెలమావులా మెరిసింది
ఒక చూపు చిలిపిగా గిలిగింత పెట్టింది
ఒక చూపు చిలిపిగా గిలిగింత పెట్టింది
వేరొక చూపు... వేరొక చూపు నిలువునా గెలుచుకొని వెళ్లింది...
తొలి చూపు దూసిందీ.. హృదయాన్ని
మరు చూపు వేసిందీ... బంధాన్ని
చరణం 2:
చూపులున్నందుకు చూసుకోవాలి...
చూసుకున్నదే తనది చేసుకోవాలి
వలపు మొలకెత్తేది ఒక చూపులోనే..ఏ..ఏ..
మనసు మనసైయ్యేది ఆ చూపుతోనే...
ఈడు జోడుగా మనమిద్దరం వెళుతుంటే...
ఎన్నెన్ని చూపులో ఈశుతో చూస్తాయి
ఈడు జోడుగా మనమిద్దరం వెళుతుంటే...
ఎన్నెన్ని చూపులో ఈశుతో చూస్తాయి
తోడు నీడగా మనం ఏకమైనామంటే...
తోడు నీడగా మనం ఏకమైనామంటే...
దేవతల చూపులే దీవెనలు అవుతాయి...
తొలి చూపు దూసిందీ.. హృదయాన్ని
మరు చూపు వేసిందీ... బంధాన్ని
ప్రతి చూపు చెరిపింది దూరాన్ని
పెళ్ళిచూపులే కలపాలి ఇద్దరిని...
అహా..హా..ఆ..ఆ..ఆ..ఆ..ఆ.ఆ
అహా..హా..ఆ..ఆ..ఆ..ఆ..ఆ.ఆ