పల్లవి:
తెలుసా మనసా ఇది ఏనాటి అనుబంధమో
తెలుసా మనసా ఇది ఏ జన్మ సంబంధమో
తరిమిన ఆరు కాలాలు ఏడు లోకాలు చేరలేని ఒడిలో
విరహపు జాడలేనాడు వేడి కన్నేసి చూడలేని జతలో
శతజన్మాల బంధాల బంగారు క్షణమిది
తెలుసా మనసా ఇది ఏనాటి అనుబంధమో
తెలుసా మనసా ఇది ఏ జన్మ సంబంధమో
చరణం 1:
ప్రతిక్షణం ఊ ఊ ఊ ఊఊ నా కళ్ళల్లో నిలిచే నీ రూపం
బ్రతుకులో ఓ ఓ ఓ ఓ అడుగడుగునా నడిపే నీ స్నేహం
ఊపిరే నీవుగా ప్రాణమే నీదిగా
పది కాలాలు ఉంటాను నీ ప్రేమ సాక్షిగ
తెలుసా మనసా ఇది ఏనాటి అనుబంధమో
చరణం 2:
ఎన్నడూ ఊ ఊ ఊ ఊ ఊ తీరిపోని రుణముగా ఉండిపో
చెలిమితో ఓ ఓ ఓ ఓ తీగ సాగే మల్లెగా అల్లుకో
లోకమే మారినా కాలమే ఆగినా
మన ఈ గాధ మిగలాలి తుదిలేని చరితగ
pallavi:
tĕlusā manasā idi enāḍi anubaṁdhamo
tĕlusā manasā idi e janma saṁbaṁdhamo
tarimina āru kālālu eḍu logālu seraleni ŏḍilo
virahabu jāḍalenāḍu veḍi kannesi sūḍaleni jadalo
śhadajanmāla baṁdhāla baṁgāru kṣhaṇamidi
tĕlusā manasā idi enāḍi anubaṁdhamo
tĕlusā manasā idi e janma saṁbaṁdhamo
saraṇaṁ 1:
pradikṣhaṇaṁ ū ū ū ūū nā kaḽḽallo nilise nī rūbaṁ
bradugulo o o o o aḍugaḍugunā naḍibe nī snehaṁ
ūbire nīvugā prāṇame nīdigā
padi kālālu uṁṭānu nī prema sākṣhiga
tĕlusā manasā idi enāḍi anubaṁdhamo
saraṇaṁ 2:
ĕnnaḍū ū ū ū ū ū tīriboni ruṇamugā uṁḍibo
sĕlimido o o o o tīga sāge mallĕgā allugo
logame mārinā kālame āginā
mana ī gādha migalāli tudileni saridaga