Telugu veera levaraa! deeksha booni saagaraa!

తెలుగు వీర లేవరా! దీక్ష బూని సాగరా!
Year
Language

పల్లవి:

ఓ ఓ ఓ ఓ ఓ... ఓ ఓ ఓ.. ఓ ఓ ఓ.. ఓ ఓ ఓ ఓ...

తెలుగు వీర లేవరా.. ఆ ఆ ఆ.. దీక్ష బూని సాగరా.. ఆ ఆ ఆ..
తెలుగు వీర లేవరా దీక్ష బూని సాగరా
దేశమాత స్వేఛ్ఛ కోరి తిరుగుబాటు చేయరా!

తెలుగు వీర లేవరా దీక్ష బూని సాగరా
దేశమాత స్వేఛ్ఛ కోరి తిరుగుబాటు చేయరా
ఆ ఆ ఆ ఆ ఆ.... ఓ ఓ ఓ ఓ ఓ.....

చరణం 1:

దారుణమారణకాండకు తల్లడిల్లవద్దురా
ఆ ఆ ఆ ....
నీతిలేని శాసనాలు నేటినుండి రద్దురా
ఆ ఆ ఆ .....
దారుణమారణకాండకు తల్లడిల్లవద్దురా
నీతిలేని శాసనాలు నేటినుండి రద్దురా

నిదురవద్దు..బెదరవద్దు !2!
నింగి నీకు హద్దురా.. నింగి నీకు హద్దురా

ఆ ఆ ఆ ఆ ఆ.... ఓ ఓ ఓ ఓ ఓ.....

చరణం 2:

ఓ ఓ ఓ ఓ ఓ...
ఎవడువాడు?..ఎచటివాడు?
ఎవడు వాడు? ఎచటి వాడు?
ఇటువచ్చిన తెల్లవాడు

కండబలం గుండెబలం
కబళించే దుండగీడు.. కబళించే దుండగీడు

మానధనం ప్రాణధనం
దోచుకొనే దొంగవాడు..దొచుకొనే దొంగ వాడు
ఎవదు వాడు ఎచటి వాదు ఇటు వచ్చిన తెల్లవాడు

తగినశాస్తి చేయరా...తగిన శాస్తి చేయరా ...
తరిమి తరిమి కొట్టరా.... తరిమి తరిమి కొట్టరా..

తెలుగు వీర లేవరా! దీక్ష బూని సాగరా!
దేశమాత స్వేఛ్ఛ కోరి తిరుగుబాటు చేయరా!

ఆ ఆ ఆ ఆ ఆ.... ఓ ఓ ఓ ఓ ఓ.....

చరణం 3:

ఈదేశం... ఈరాజ్యం...
ఈ దేశం ఈ రాజ్యం నాదే అని చాటించి.. నాదే అని చాటించి

ప్రతిమనిషి తొడలుగొట్టి... శృంఖలాలు పగులగొట్టి..శృంఖలాలు పగులగొట్టి
చురకత్తులు పదునుపెట్టి... తుది సమరం మొదలుపెట్టి
.. తుది సమరం మొదలుపెట్టి..
సింహాలై గర్జించాలీ...సింహాలై గర్జించాలీ
సంహారం సాగించాలీ...సంహారం సాగించాలీ

వందేమాతరం... వందేమాతరం..
వందేమాతరం... వందేమాతరం..

ఓ ఓ ఓ ఓ ఓ...
స్వాత్రంత్య వీరుడా స్వరాజ్య పాలుడా
అల్లూరి సీతారామరాజా.. అల్లూరి సీతారామరాజా
స్వాత్రంత్య వీరుడా స్వరాజ్య పాలుడా
అల్లూరి సీతారామరాజా.. అల్లూరి సీతారామరాజా

అందుకో మా పూజ లందుకో.. రాజా..
అందుకో మా పూజ లందుకో.. రాజా..

అల్లూరిసీతారామరాజా.. ఆ...అల్లూరిసీతారామరాజా..

ఓ ఓ ఓ ఓ ఓ...

తెల్లవాడి గుండెల్లో నుదురించినవాడా
ఆ నిదురించిన పౌరుషాగ్ని అగిలించిన వాడా
తెల్లవాడి గుండెల్లో నుదురించినవాడా
ఆ నిదురించిన పౌరుషాగ్ని అగిలించిన వాడా

త్యాగాలే భరిస్తాం.. కష్టాలే భరిస్తాం
త్యాగాలే భరిస్తాం.. కష్టాలే భరిస్తాం

నిశ్చయముగ నిర్భయముగ నీ వెంటనే నడుస్తాం...
నిశ్చయముగ నిర్భయముగ నీ వెంటనే నడుస్తాం...

pallavi:

o o o o o... o o o.. o o o.. o o o o...

tĕlugu vīra levarā.. ā ā ā.. dīkṣha būni sāgarā.. ā ā ā..
tĕlugu vīra levarā dīkṣha būni sāgarā
deśhamāda svechhchha kori tirugubāḍu seyarā!

tĕlugu vīra levarā dīkṣha būni sāgarā
deśhamāda svechhchha kori tirugubāḍu seyarā
ā ā ā ā ā.... o o o o o.....

saraṇaṁ 1:

dāruṇamāraṇagāṁḍagu tallaḍillavaddurā
ā ā ā ....
nīdileni śhāsanālu neḍinuṁḍi raddurā
ā ā ā .....
dāruṇamāraṇagāṁḍagu tallaḍillavaddurā
nīdileni śhāsanālu neḍinuṁḍi raddurā

niduravaddu..bĕdaravaddu !2!
niṁgi nīgu haddurā.. niṁgi nīgu haddurā

ā ā ā ā ā.... o o o o o.....

saraṇaṁ 2:

o o o o o...
ĕvaḍuvāḍu?..ĕsaḍivāḍu?
ĕvaḍu vāḍu? ĕsaḍi vāḍu?
iḍuvachchina tĕllavāḍu

kaṁḍabalaṁ guṁḍĕbalaṁ
kabaḽiṁche duṁḍagīḍu.. kabaḽiṁche duṁḍagīḍu

mānadhanaṁ prāṇadhanaṁ
dosugŏne dŏṁgavāḍu..dŏsugŏne dŏṁga vāḍu
ĕvadu vāḍu ĕsaḍi vādu iḍu vachchina tĕllavāḍu

taginaśhāsti seyarā...tagina śhāsti seyarā ...
tarimi tarimi kŏṭṭarā.... tarimi tarimi kŏṭṭarā..

tĕlugu vīra levarā! dīkṣha būni sāgarā!
deśhamāda svechhchha kori tirugubāḍu seyarā!

ā ā ā ā ā.... o o o o o.....

saraṇaṁ 3:

īdeśhaṁ... īrājyaṁ...
ī deśhaṁ ī rājyaṁ nāde ani sāḍiṁchi.. nāde ani sāḍiṁchi

pradimaniṣhi tŏḍalugŏṭṭi... śhṛṁkhalālu pagulagŏṭṭi..śhṛṁkhalālu pagulagŏṭṭi
suragattulu padunubĕṭṭi... tudi samaraṁ mŏdalubĕṭṭi
.. tudi samaraṁ mŏdalubĕṭṭi..
siṁhālai garjiṁchālī...siṁhālai garjiṁchālī
saṁhāraṁ sāgiṁchālī...saṁhāraṁ sāgiṁchālī

vaṁdemādaraṁ... vaṁdemādaraṁ..
vaṁdemādaraṁ... vaṁdemādaraṁ..

o o o o o...
svātraṁtya vīruḍā svarājya pāluḍā
allūri sīdārāmarājā.. allūri sīdārāmarājā
svātraṁtya vīruḍā svarājya pāluḍā
allūri sīdārāmarājā.. allūri sīdārāmarājā

aṁdugo mā pūja laṁdugo.. rājā..
aṁdugo mā pūja laṁdugo.. rājā..

allūrisīdārāmarājā.. ā...allūrisīdārāmarājā..

o o o o o...

tĕllavāḍi guṁḍĕllo nuduriṁchinavāḍā
ā niduriṁchina pauruṣhāgni agiliṁchina vāḍā
tĕllavāḍi guṁḍĕllo nuduriṁchinavāḍā
ā niduriṁchina pauruṣhāgni agiliṁchina vāḍā

tyāgāle bharistāṁ.. kaṣhṭāle bharistāṁ
tyāgāle bharistāṁ.. kaṣhṭāle bharistāṁ

niśhchayamuga nirbhayamuga nī vĕṁṭane naḍustāṁ...
niśhchayamuga nirbhayamuga nī vĕṁṭane naḍustāṁ...