Telugu imti peradilona

తెలుగు ఇంటి పెరటిలోన
Work
Year
Language

పల్లవి:

తెలుగు ఇంటి పెరటిలోన విరిసే మందారమా...
చిగురు మావి గుబురులోని కుహు కుహూల రాగమా...
I am feeling feeling feeling
that i am falling in love
అహ ప్రేమా ప్రేమా ప్రేమా అంటూ.. i want to live
ఈ ఊరి గాలి మంచి కబురు తెచ్చిందీ
కోరుకోని కాలమేమొ కలిసొచ్చింది

నయగారా దారుల్లో ఉరికే జలపాతమా...
న్యూజెర్సీ తోటల్లో అల్లుకున్న శాంతమా...
I am feeling feeling feeling
that i am falling in love
అహ ప్రేమా ప్రేమా ప్రేమా అంటూ... i want to live
ఈ చిన్ని మాట నాకు భలే నచ్చింది
ఇంతవరకు లేని హాయి తెలిసొచ్చింది

చరణం 1:

జూలియట్టు రోమియోల జంటలీల మనదీ
నలదమయంతిలోని పంతమే ఇదీ
డ్రీం ల్యాండు నేలమీద ప్రేమ కాండ మనది
యదుకుల వీధిలోని ప్రణయమే ఇదీ
దేశం మారినా ప్రేమ రసం ఒక్కటే
కాలం మారినా కన్నెతనం ఒక్కటే
చనువే పెరిగినా తనువే మరిగినా
సరిగంగ స్నానాల వణుకు ఒక్కటే

వాల్ట్ డిస్నీ ఊహల్లో దాగిన సౌందర్యమా
పడమరమ్మ నుదుటిపైన మెరిసే సింధూరమా
I am feeling feeling feeling that i am falling in love
అహ ప్రేమా ప్రేమా ప్రేమా అంటూ i want to live

చరణం 2:

ఆంధ్ర పెదవి ఆంగ్ల పెదవి హత్తుకున్న నిమిషం
మధువుల ముంచు ఫ్రెంచు ముద్దులే సుమా
సీమరాణి రామరాజు దగ్గరైన తరుణం
మనువుకు గ్రీను కార్డు సిధ్ధమే సుమా
అతిధిగ వచ్చినా అమృతమే ఇవ్వనా
హృదయం అర్పణ ఈ క్షణమే చెయ్యనా
తరగని కాంక్షతో వదలని దీక్షతో
వెయ్యేళ్ళు వెయ్యాలి వలపు వంతెనా

విజయనగర వీధుల్లో మెరిసే రవి కిరణమా
వాషింగ్ టన్ వీధుల్లో కురిసే హిమ చైత్రమా
I am feeling feeling feeling that i am falling in love
అహ ప్రేమా ప్రేమా ప్రేమా అంటూ i want to live
ఈ చిన్న మాట నాకు భలే నచ్చింది
కోరుకోని కాలమేమొ కలిసొచ్చింది

pallavi:

tĕlugu iṁṭi pĕraḍilona virise maṁdāramā...
siguru māvi guburuloni kuhu kuhūla rāgamā...
I am feeling feeling feeling
that i am falling in love
aha premā premā premā aṁṭū.. i want to live
ī ūri gāli maṁchi kaburu tĕchchiṁdī
korugoni kālamemŏ kalisŏchchiṁdi

nayagārā dārullo urige jalabādamā...
nyūjĕrsī toḍallo allugunna śhāṁtamā...
I am feeling feeling feeling
that i am falling in love
aha premā premā premā aṁṭū... i want to live
ī sinni māḍa nāgu bhale nachchiṁdi
iṁtavaragu leni hāyi tĕlisŏchchiṁdi

saraṇaṁ 1:

jūliyaṭṭu romiyola jaṁṭalīla manadī
naladamayaṁtiloni paṁtame idī
ḍrīṁ lyāṁḍu nelamīda prema kāṁḍa manadi
yadugula vīdhiloni praṇayame idī
deśhaṁ mārinā prema rasaṁ ŏkkaḍe
kālaṁ mārinā kannĕdanaṁ ŏkkaḍe
sanuve pĕriginā tanuve mariginā
sarigaṁga snānāla vaṇugu ŏkkaḍe

vālṭ ḍisnī ūhallo dāgina sauṁdaryamā
paḍamaramma nuduḍibaina mĕrise siṁdhūramā
I am feeling feeling feeling that i am falling in love
aha premā premā premā aṁṭū i want to live

saraṇaṁ 2:

āṁdhra pĕdavi āṁgla pĕdavi hattugunna nimiṣhaṁ
madhuvula muṁchu phrĕṁchu muddule sumā
sīmarāṇi rāmarāju daggaraina taruṇaṁ
manuvugu grīnu kārḍu sidhdhame sumā
adidhiga vachchinā amṛtame ivvanā
hṛdayaṁ arbaṇa ī kṣhaṇame sĕyyanā
taragani kāṁkṣhado vadalani dīkṣhado
vĕyyeḽḽu vĕyyāli valabu vaṁtĕnā

vijayanagara vīdhullo mĕrise ravi kiraṇamā
vāṣhiṁk ṭan vīdhullo kurise hima saitramā
I am feeling feeling feeling that i am falling in love
aha premā premā premā aṁṭū i want to live
ī sinna māḍa nāgu bhale nachchiṁdi
korugoni kālamemŏ kalisŏchchiṁdi