Tellaseeragu

తెల్లచీరకు
Year
Language

పల్లవి:

తెల్లచీరకు తకధిమి తపనలు రేగేనమ్మా సందె ఎన్నెల్లో
సిరిమల్లె పూలకు సరిగమ ఘుమఘుమ తాకేనమ్మ జంట ముద్దుల్లో
అవే తీయనీ సరాగాలుగా
ఇలా హాయిగా స్వరాలూదగా
సన్నాయంటి వయ్యారంలో సాయంత్రాలే సంగీతాలై

మల్లెపూలకు సరిగమ ఘుమఘుమ తాకేనమ్మ జంట ముద్దుల్లో
అహ తెల్లచీరకు తకధిమి తపనలు రేగేనమ్మా సందె ఎన్నెల్లో

చరణం 1:

రప్పప్పా పప్పా పప్పా పప్పా

వైశాఖం తరుముతుంటే నీ ఒళ్ళో ఒదుగుతున్నా
ఆషాఢం ఉరుముతుంటే నీ మెరుపే చిదుముకున్నా
కవ్వింతలో వాలి పువ్వంత కావాలి పండించుకోవాలి ఈ బంధమే
నీతోడు కావాలి నే తోడుకోవాలి నీ నీడలో ఉన్న శృంగారమే
జాబిల్లీ... సూరీడూ... ఆకాశంలో నిండిన సొగసుల

తెల్లచీరకు తకధిమి తపనలు రేగేనమ్మా సందె ఎన్నెల్లో
సిరిమల్లె పూలకు సరిగమ ఘుమఘుమ తాకేనమ్మ జంట ముద్దుల్లో

చరణం 2:

కార్తీకం అహ్.. కలిసి వస్తే నీ పరువం అడుగుతున్నా
హేమంతం కరుగుతుంటే నీ అందం కడుగుతున్నా
ఆకాశ దేశాన ఆ మేఘరాగాలు పలికాయి నా స్వప్నసంగీతమే
ఈ చైత్రమాసాల చిరునవ్వు దీపాలు వెలిగాయి నీ కంట నాకోసమే
గిలిగింతే... గీతాలై... సింగారానికి సిగ్గులు కలిపిన

తెల్లచీరకు తకధిమి తపనలు రేగేనమ్మా సందె ఎన్నెల్లో
సిరిమల్లె పూలకు సరిగమ ఘుమఘుమ తాకేనమ్మ జంట ముద్దుల్లో
అవే తీయనీ సరాగాలుగా
ఇలా హాయిగా స్వరాలూదగా
సన్నాయంటి వయ్యారంలో సాయంత్రాలే సంగీతాలై

తెల్లచీరకు తకధిమి తపనలు రేగేనమ్మా సందె ఎన్నెల్లో
సిరిమల్లె పూలకు సరిగమ ఘుమఘుమ తాకేనమ్మ జంట ముద్దుల్లో

pallavi:

tĕllasīragu tagadhimi tabanalu regenammā saṁdĕ ĕnnĕllo
sirimallĕ pūlagu sarigama ghumaghuma tāgenamma jaṁṭa muddullo
ave tīyanī sarāgālugā
ilā hāyigā svarālūdagā
sannāyaṁṭi vayyāraṁlo sāyaṁtrāle saṁgīdālai

mallĕbūlagu sarigama ghumaghuma tāgenamma jaṁṭa muddullo
aha tĕllasīragu tagadhimi tabanalu regenammā saṁdĕ ĕnnĕllo

saraṇaṁ 1:

rappappā pappā pappā pappā

vaiśhākhaṁ tarumuduṁṭe nī ŏḽḽo ŏdugudunnā
āṣhāḍhaṁ urumuduṁṭe nī mĕrube sidumugunnā
kavviṁtalo vāli puvvaṁta kāvāli paṁḍiṁchugovāli ī baṁdhame
nīdoḍu kāvāli ne toḍugovāli nī nīḍalo unna śhṛṁgārame
jābillī... sūrīḍū... āgāśhaṁlo niṁḍina sŏgasula

tĕllasīragu tagadhimi tabanalu regenammā saṁdĕ ĕnnĕllo
sirimallĕ pūlagu sarigama ghumaghuma tāgenamma jaṁṭa muddullo

saraṇaṁ 2:

kārdīgaṁ ah.. kalisi vaste nī paruvaṁ aḍugudunnā
hemaṁtaṁ karuguduṁṭe nī aṁdaṁ kaḍugudunnā
āgāśha deśhāna ā megharāgālu paligāyi nā svapnasaṁgīdame
ī saitramāsāla sirunavvu dībālu vĕligāyi nī kaṁṭa nāgosame
giligiṁte... gīdālai... siṁgārānigi siggulu kalibina