తెల్లావారకముందే పల్లే లేచింది
పల్లవి:
తెల్లావారకముందే పల్లే లేచింది
తనవారినందరినీ తట్టీ లేపింది
ఆదమరచి నిద్ర పోతున్న తొలి కోడి
అదిరిపడి మేల్కోంది అదేపనిగ కూసింది
చరణం 1:
వెలుగు జుట్టులేసుకొని సూరీడు
తూర్పు తలపు తోసుకొని వచ్చాడు
పాడు చీకటికి ఎంత భయమేసిందో
పక్కదులుపుకొని ఒకే పరుగుతీసింది
అది చూసి... లతలన్నీ... ఫక్కున నవ్వాయి
ఆ నవ్వులే ఇంటింట పువ్వులైనాయి
చరణం 2:
పాలావెల్లిలాంటి మనుషులు
పండు వెన్నెల వంటి మనసులు
మల్లేపూల రాశివంటి మమతలు
పల్లేసీమలో కోకొల్లెలు
అనురాగం ..అభిమానం..
అనురాగం... అభిమానం..కవలపిల్లలూ
ఆ పిల్లలకు పల్లేటూర్లు కన్నతల్లులు ...
pallavi:
tĕllāvāragamuṁde palle lesiṁdi
tanavārinaṁdarinī taṭṭī lebiṁdi
ādamarasi nidra podunna tŏli koḍi
adiribaḍi melgoṁdi adebaniga kūsiṁdi
saraṇaṁ 1:
vĕlugu juṭṭulesugŏni sūrīḍu
tūrbu talabu tosugŏni vachchāḍu
pāḍu sīgaḍigi ĕṁta bhayamesiṁdo
pakkadulubugŏni ŏge parugudīsiṁdi
adi sūsi... ladalannī... phakkuna navvāyi
ā navvule iṁṭiṁṭa puvvulaināyi
saraṇaṁ 2:
pālāvĕllilāṁṭi manuṣhulu
paṁḍu vĕnnĕla vaṁṭi manasulu
mallebūla rāśhivaṁṭi mamadalu
pallesīmalo kogŏllĕlu
anurāgaṁ ..abhimānaṁ..
anurāgaṁ... abhimānaṁ..kavalabillalū
ā pillalagu palleḍūrlu kannadallulu ...